తెలంగాణలో దసరా వచ్చిందంటే.. ఎక్కడ చూసినా సందడే సందడి. బతుకమ్మ పాటలు, ఆటలతో ఈ ప్రాంతం కళకళలాడిపోతుంది. వేరే ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో ఉంటున్న వారు కూడా ఆ పండుగలో భాగం అయిపోతారు. ఆటపాటలను ఎంతో ఆస్వాదిస్తారు.
పుట్టి పెరిగింది.. సినీ రంగ ప్రవేశం చేసింది కర్ణాటకలో అయినా.. తెలుగు సినిమాల్లో ఎనలేని పేరు సంపాదించి, ఈ ఏడాదే విజయ్ దేవరకొండను పెళ్లాడి తెలంగాణ కోడలిగా కూడా మారిపోయిన రష్మిక కూడా ఇప్పుడు బతుకమ్మ పండుగలో భాగం అయింది.
దసరా ముంగిట ఆదివారం సద్దుల బతుకమ్మ పండుగ కాగా.. తెలంగాణ ప్రభుత్వం ఈ ఫెస్టివల్ను అధికారికంగా నిర్వహించింది. ఈ వేడుకలకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలను ఆహ్వానించింది. ఆ ఇద్దరూ రావడంతో ఈ వేడుకలకు మరింత కళ పెరిగింది. సంప్రదాయ దుస్తుల్లో అందంగా తయారై వచ్చిన రష్మిక.. ట్యాంక్ బండ్ మీద మహిళలతో కలిసి బతుకమ్మ పాటకు డ్యాన్స్ చేయడం అందరినీ అమితంగా ఆకట్టుకుంది.
ఈ వీడియోలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.
విజయ్, రష్మిక జోడీ ఇటీవలే రణబాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమాకు ఆరంభంలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. తర్వాత టాక్ మెరుగుపడింది. వసూళ్లు కూడా మెరుగ్గానే వస్తున్నాయి. దసరా సెలవుల అడ్వాంటేజీని సినిమా బాగానే ఉపయోగించుకునేలా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని రాహుల్ సంకృత్యన్ రూపొందించాడు.
This post was last modified on October 18, 2026 11:39 pm
కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలిపోయింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ సినిమా ‘స్పిరిట్’ వచ్చే ఏడాది…
వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాకా.. కడప జిల్లాలోనే ఆ పార్టీ పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. ఆదివారం మధ్యాహ్నం 3…
తెలుగులో దర్శకుడయ్యే ప్రతి వ్యక్తికీ.. తప్పక సినిమా చేయాలనిపించే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాలు చూసి దర్శకులయ్యాం అని…
తాజాగా వైసీపీ అధినేత జగన్ వ్యవహరించిన తీరు ఆశ్చర్యకరంగా మారింది. ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అనిల్ చంద్రపునేఠాపై…
బాక్సాఫీస్ వద్ద మెల్లగా పుంజుకుంటున్న గరివిడి లక్ష్మికి మంచి ప్రశంసలే దక్కుతున్నాయి. ముఖ్యంగా ఆవిడ ప్రాంతమైన ఉత్తరాంధ్రలో చెప్పుకోదగ్గ కలెక్షన్లు…
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయి రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా కొన్ని…