Political News

A1,A2 మాటలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు

విజయవాడ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏబీ వెంకటేశ్వర రావు వెనక ముఖ్యమంత్రి చంద్రబాబు వున్నారంటూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన విమర్శలపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఐపీస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వర రావు ఇటీవల కాలంలో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలను విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో వైసీపీని టార్గెట్ చేసిన ఆయన ఈమధ్య టీడీపీపై కూడా విమర్శలు ఎక్కు పెట్టారు. ఊహించని రీతిలో విజయవాడ మేయర్ బరిలో దిగారు.

ఏబీ వెంకటేశ్వర రావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో విజయసాయి రెడ్డి బుర్రకు తోచినట్లు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు మండి పడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని తీవ్రంగా స్పందించారు. A1,A2 మాటలను విజయవాడ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని తేల్చి చెప్పారు. ఉనికి చాటుకోవడానికి చంద్రబాబు కు లేనిపోని కుట్రలు అంటగడుతున్నారని విమర్శించారు. తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేయడంలో విజయసాయిరెడ్డి దిట్టని విమర్శించారు.

కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించి విడగొట్టేందుకు విజయసాయి ప్రయత్నం చేస్తున్నట్లు చిన్ని ఆరోపించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా కూటమి కలిసే ఉంటుందని స్పష్టం చేశారు. అంతా కలిసి మెలిసే విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 మధ్య బీజేపీ నుంచి టీడీపీని దూరం చేయాలని చాలా కుట్రలు చేశానని స్వయంగా చెప్పుకున్న సాయిరెడ్డి ఇప్పుడు మళ్ళీ అదే పనికి కూలీ కుదుర్చుకున్నట్లుందని ఎద్దేవా చేశారు. తప్పుడు ప్రచారాలతో కూటమి పార్టీల ఐక్యతను దెబ్బతీయడానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.

ఇదిలావుండగా విజయవాడ మేయర్ గా పోటీ చేస్తున్న ఏబీ వెంకటేశ్వర రావుకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఏబీ పోటీ కోసం చొరవ చూపినట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఆయన చంద్రబాబు తీరు మీద అసంతృప్తిగా వున్నట్లు పలు సందర్భాల్లో స్వయంగా ప్రకటించుకున్నారు కూడా. మాజీ ముఖ్యమంత్రి జగన్ పని పట్టేందుకు తనకు తగిన పదవి ఇవ్వాలసిందిగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మేయర్ గా బరిలోకి దిగడం వెనక చంద్రబాబు వున్నట్లు సాయి రెడ్డి చేసిన ఆరోపణలనుపలువురు కొట్టి పడేస్తున్నారు.

This post was last modified on October 18, 2026 10:54 pm

Share

Recent Posts

రాజమౌళి సంకల్పం చాలా పెద్దది

ఫిలిం నగర్ వర్గాల్లోనే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ తలెత్తుతున్న ప్రశ్న ఒకటే. వారణాసి వాయిదా గురించి తిరుగుతున్న పుకార్లు నిజమా…

37 minutes ago

నెత్తుటి సముద్రంలో ‘కల్ట్’ విధ్వంసం

ఎవరూ బ్రేక్ ఇవ్వకపోతే మనకు మనమే ఇచ్చుకోవాలనే సూత్రం పాటిస్తున్నాడు హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్. హ్యాట్రిక్ డిజాస్టర్లు…

2 hours ago

అంబటి కన్ను హోం మంత్రి సీటుపై పడిందా

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నోటి…

4 hours ago

ప్యారడైజ్ కోసం కాచుకుని ఉన్నారు

అనుకున్నట్టే ప్యారడైజ్ ఓటిటి రిలీజ్ సరిగ్గా నాలుగు వారాలకు వచ్చేస్తోంది. ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు నెట్…

6 hours ago

సీఈసీ ఎంపికపై జగన్ పశ్చాత్తాపం

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ…

6 hours ago

ఇప్పుడు పార్టీ ప్రమోషన్ ఎందుకు సాయిరెడ్డి గారు

ఏపీలో కొత్త పార్టీకి శ్రీకారం చుడుతున్నాన‌ని చెబుతున్న మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయ‌కుడు వి. విజ‌య‌సాయిరెడ్డి తాజాగా మ‌రో…

7 hours ago