Movie News

రాజమౌళి సంకల్పం చాలా పెద్దది

ఫిలిం నగర్ వర్గాల్లోనే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ తలెత్తుతున్న ప్రశ్న ఒకటే. వారణాసి వాయిదా గురించి తిరుగుతున్న పుకార్లు నిజమా కాదాని. టీమ్ చెబుతున్న దాని ప్రకారం అందులో వీసమెత్తు నిజం లేదు. ఎందుకంటే ఏప్రిల్ 7 విడుదలకు అనుగుణంగానే అంతర్జాతీయ స్థాయిలో ప్లానింగ్ జరిగిపోయింది. తగినన్ని ఐమాక్స్ స్క్రీన్లు దొరికేలా రాజమౌళి బృందం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. విఎఫ్ఎక్స్ కు ముందే షూటింగ్ భాగాన్ని దాదాపుగా పూర్తి చేశారు జక్కన్న. సో టెన్షన్ లేదు.

అయితే రాజమౌళి సైతం సమాధానం చెప్పలేని ప్రశ్న ఒకటుంది. ఆరు నూరైనా భూమి బద్దలైనా మాట తప్పగలరా అంటే ఔనని ఆన్సర్ ఇవ్వలేరు. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితులు ఇలాగే ఉంటాయన్న గ్యారెంటీ లేదు. ఆర్ఆర్ఆర్ టైంలోనూ తక్కువ టైంలో రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ కరోనా మహమ్మారి దెబ్బకు రెండేళ్లకు పైగా విలువైన సమయం వృథా అయ్యింది. వారణాసికి అంత తీవ్రమైన సమస్య రాదు వేరే ఇబ్బందులను ఇప్పుడే ప్రెడిక్ట్ చేయలేం.

ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్, వివిధ భాషల్లో ప్రమోషన్స్, థియేటర్ బిజినెస్, అగ్రిమెంట్లు, ఓటిటి డీల్స్, పబ్లిసిటీ ప్లాన్స్, హీరో మహేష్ బాబుతో సహా టీమ్ ని వివిధ దేశాలు తిప్పే మార్కెటింగ్ అస్త్రాలు ఇలా ఎన్నో రాజమౌళి మెదడులో నిక్షిప్తమై ఉంటాయి. ఇవన్నీ సాఫీగా ఎలాంటి అడ్డంకులు లేకుండా జరుగుతాయనే గ్యారెంటీ లేదు. జక్కన్న మటుకు ఏప్రిల్ 7 లక్ష్యంగా పెట్టుకుని అన్ని రెడీ చేసుకుంటున్నారు. వారణాసి తన డేట్ కి కట్టుబడితే ఫౌజీ మార్చి మొదటి వారంలోనే రావాల్సి ఉంటుంది.

ఇంకో నాలుగైదు నెలల వరకు ఈ తరహా డిస్కషన్లు జరుగుతూనే ఉంటాయి. రాజమౌళి ఇప్పటికీ ఇతర దేశాల్లో ఆర్ఆర్ఆర్ ప్రీమియర్లు హాజరు కావడానికి కారణం ఒకటే. వారణాసిని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలి అంటే తన బ్లాక్ బస్టర్స్ ని ఫారినర్స్ కి పదే పదే పరిచయం చేయాలి. ప్రీమియర్లు వేయించాలి. ఇదేదో సరదాకి చేస్తున్నది కాదు. ఆయన ప్రతి చేతల వెనుక వారణాసిని ముందుకు తీసుకెళ్లే బృహత్తర సంకల్పం ఉంది. అది అర్థంచేసుకోవడం అంత ఈజీ కాదు.

This post was last modified on October 18, 2026 10:31 pm

Share

Recent Posts

సందీప్ వంగను అభినందించాలి

కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలిపోయింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ సినిమా ‘స్పిరిట్’ వచ్చే ఏడాది…

3 hours ago

జగన్ ఇలాకాలోనే సగానికి పైగా ఏకగ్రీవాలా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత ఇలాకా.. క‌డ‌ప జిల్లాలోనే ఆ పార్టీ ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డింది. ఆదివారం మ‌ధ్యాహ్నం 3…

5 hours ago

పేట దర్శకుడికి ఛాన్సివ్వాలి బాసు

తెలుగులో దర్శకుడయ్యే ప్రతి వ్యక్తికీ.. తప్పక సినిమా చేయాలనిపించే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాలు చూసి దర్శకులయ్యాం అని…

5 hours ago

తెలంగాణ కోడలు ర‌ష్మిక బ‌తుక‌మ్మ ఆడితే…

తెలంగాణ‌లో ద‌స‌రా వ‌చ్చిందంటే.. ఎక్క‌డ చూసినా సంద‌డే సంద‌డి. బ‌తుక‌మ్మ పాట‌లు, ఆట‌ల‌తో ఈ ప్రాంతం క‌ళ‌క‌ళ‌లాడిపోతుంది. వేరే ప్రాంతాల…

5 hours ago

పునేఠాను తిట్టి ఆయ‌న‌కే ఫిర్యాదు చేసిన జ‌గ‌న్‌

తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. ఏపీ ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ అనిల్ చంద్ర‌పునేఠాపై…

6 hours ago

తెలుగు ప్రతిభని గుర్తించడం లేటయ్యింది

బాక్సాఫీస్ వద్ద మెల్లగా పుంజుకుంటున్న గరివిడి లక్ష్మికి మంచి ప్రశంసలే దక్కుతున్నాయి. ముఖ్యంగా ఆవిడ ప్రాంతమైన ఉత్తరాంధ్రలో చెప్పుకోదగ్గ కలెక్షన్లు…

6 hours ago