Political News

జనసేన అభ్యర్థుల జాబితా విడుదల… విజయవాడ ఆయనకే

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే కూటమి పార్టీల అధినేతలు ఒక అవగాహనకు వచ్చి సీట్ల సర్దుబాటు చేశారు. అక్కడా ఇక్కడా కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వారి నిర్ణయాన్ని గౌరవించి కూటమి గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరముంది. సీట్ల సర్దుబాటు పూర్తయిన నేపథ్యంలో జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.

మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేయనున్న అభ్యర్ధుల తొలి జాబితాకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపారు. మరోవైపు, అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ఇటు చంద్రబాబు, అటు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. అయితే, రిజర్వేషన్లు, రొటేషన్ పద్ధతి, స్థానిక బలాబలాలు, కుల సమీకరణాలు వంటి పలు విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే సీట్ల పంపకాలు జరిగాయి.

కానీ, సీట్ల పంపకాల విషయంలో తమకు అన్యాయం జరిగింది అంటూ టీడీపీ, జనసేన నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరైతే బహిరంగంగా మీడియా ముందు తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇలా చేయడం వల్ల వైసీపీకి లోకువ కావడం తప్ప ఒరిగేదేమీ ఉండదన్న విషయాన్ని వారు గ్రహించాలి. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మాదిరిగానే ఈ సారి కూడా కూటమి తరఫున నిలబడిన అభ్యర్థి గెలుపు కోసం కూటమి పార్టీల నేతలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జనసేన అభ్యర్థుల జాబితా:

కార్పొరేషన్లు

1.ఏలూరు: శ్రీ రెడ్డి అప్పలనాయుడు
2.విజయవాడ: శ్రీ వంగవీటి రాధాకృష్ణ

మున్సిపాలిటీలు

  1. అమలాపురం: శ్రీ నల్లా శ్రీధర్
  2. ⁠చిలకలూరిపేట: శ్రీమతి తోట రాజరాజేశ్వరి
  3. ⁠గొల్లప్రోలు: శ్రీ కడారి తమ్మయ్య నాయుడు
  4. ⁠నరసాపురం: శ్రీమతి కొత్తపల్లి శైలజ
    5.నిడదవోలు: శ్రీమతి కల్లం జ్యోతి
    6.పెడన: శ్రీమతి మట్టా శివపావని
    7.పిఠాపురం: డాక్టర్ బీరా విజయ్ శేఖర్
    8.పుత్తూరు: శ్రీ డి. ఏలుమలై
    9.సాలూరు: శ్రీమతి గొర్లె విజయకుమారి
    10.సామర్లకోట: శ్రీ పిట్టా జానకి రామారావు
    11.తెనాలి: శ్రీ తోటకూర వెంకట రమణారావు
    12.తిరువూరు: శ్రీమతి పి. మాధవి

This post was last modified on October 17, 2026 12:57 pm

Share

Recent Posts

కంపెనీకి చివరి మెయిల్.. ఇంట్లో భార్యాభర్తల మృతదేహాలు!

భార్య పుట్టినరోజు నాడే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అంతకుముందు ఉదయం ఆ ఉద్యోగి…

2 hours ago

దుల్కర్ సల్మాన్‌కు ఇక్కడే రాసిపెట్టి ఉంది

మామూలుగా పెద్ద స్టార్ల కొడుకులు సినీ రంగంలోకి అడుగుపెడితే.. తండ్రి పేరును వాడుకోవడానికే ప్రయత్నిస్తారు. తండ్రి రెఫరెన్సులను తమ సినిమాల్లో…

2 hours ago

ప్రభుత్వమే తెచ్చిన డేటింగ్ యాప్ కానీ…

యువత పెళ్లిళ్లకు దూరంగా ఉండడంతో సింగపూర్ ప్రభుత్వం మాత్రం ఓ కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకోవాలనుకునే యువతీ యువకులను…

3 hours ago

తెలుగు వాళ్లకు ఆయన చాలా స్పెషల్

వారం కిందటే భారతీయ సినీ పరిశ్రమ నానా పటేకర్ లాంటి గొప్ప నటుడిని కోల్పోయింది. ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్న ఆయన…

4 hours ago

రవితేజ రూటు పట్టిన అల్లరి నరేష్

ఇరుముడి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక కొత్త ఫార్ములా సృష్టించింది. మాములుగా స్టార్ హీరోలు దేవుళ్ళ మాల వేసుకునే క్యారెక్టర్లు…

5 hours ago

అందరికీ న్యాయం చేసిన టీడీపీ

స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. మంచి ముహుర్తాలు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు హడావుడిగా నామినేషన్లు…

5 hours ago