ప్యాన్ ఇండియా మూవీ కాకపోయినా, వందల కోట్ల బడ్జెట్ పెట్టకపోయినా ఆదర్శ కుటుంబం ఏకే 47 వాయిదాలు దగ్గుబాటి అభిమానులను అసహనానికి గురి చేశాయి. ముఖ్యంగా అక్టోబర్ 2, 9 తేదీలు మిస్ చేసుకుని బంగారం లాంటి దసరా సెలవుల సీజన్ వదిలేసుకోవడం ఎంత పెద్ద తప్పో జైలర్ 2, రణబాలి నిరూపిస్తున్నాయి. మిక్స్డ్ టాక్ తోనూ మంచి వసూళ్లు రాబడుతున్నాయంటే హాలిడే సీజన్ లో తెలుగు ప్రేక్షకులు థియేటర్ వినోదానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అర్థమవుతుంది.
నిర్మాత నాగవంశీకి తాజాగా జరిపిన జైలర్ 2 సక్సెస్ ప్రెస్ మీట్ లో మరోసారి ఈ ప్రస్తావన వచ్చింది. కొత్త తేదీ ఫిక్స్ అయ్యిందని, కానీ జనం నమ్మడం మానేసి ఈసారి ఏదైనా చెబితే తన్నేలా ఉన్నారని, జనవరి 12 విడుదల షూటింగ్ జరుగుతున్న ఊటీ నుంచి వెంకటేష్ తిరిగి వచ్చాక 21 లేదా 22 తేదీల్లో ట్రైలర్ తో పాటు ఆయనతోనే అనౌన్స్ మెంట్ ఇప్పిస్తామని కుండ బద్దలు కొట్టేశారు. నేరుగా కాకపోయినా అక్టోబర్ 30 రిలీజ్ ఉంటుందని ఇన్ డైరెక్ట్ గా ఒప్పేసుకున్నారు.
సో దాదాపు అన్ని అనుమానాలు తీరిపోయినట్టే. అయితే అదే డేట్ కి విశ్వక్ సేన్ కల్ట్, నాగార్జున సమర్పిస్తున్న ఇట్లు అర్జున ఫిక్స్ చేసుకుని ఉన్నాయి. మరిప్పుడు మనసు మార్చుకుని నవంబర్ కు వెళ్తాయా లేక వెంకీతో పోటీకి సై అంటాయా వేచి చూడాలి. ఇప్పటికే బాగా ఆలస్యమయింది. నాగవంశీ చెప్పింది నిజమే అయిన పక్షంలో ఇంకో పన్నెండు రోజుల్లోనే బాలన్స్ సాంగ్స్ రిలీజ్, ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నీ చేసేయాలి. టీమ్ ఒత్తిడి మధ్య ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయం.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఆదర్శ కుటుంబం మీద ట్రేడ్ వర్గాల్లో మంచి క్రేజ్ ఉంది. హీరో డైరెక్టర్ కాంబోలో మొదటి సినిమా కావడంతో ఫ్యాన్స్ కూడా స్పెషల్ గా ఫీలవుతున్నారు. అయితే బజ్ పరంగా కొంచెం వెనుకబడిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు రాబోయే రోజుల్లో పబ్లిసిటీ చాలా కీలకం. నారాయణమ్మ తప్ప తమన్ కంపోజ్ చేసిన వేరే సాంగ్స్ బయటికి రాలేదు. శ్రీనిధి శెట్టి ఇందులో మెయిన్ హీరోయిన్ కాగా నివేత పేతురాజ్ పాత్ర కీలకంగా ఉండబోతోంది.
This post was last modified on October 17, 2026 1:00 pm
ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన నటి కాజల్ అగర్వాల్. వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే.. సినిమాలకు…
అదేం చిత్రమో కానీ... రెండూ తెలుగు రాష్ట్రాల్లో ఒకే విధమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో…
సూర్య కొత్త సినిమా 'సీన్' వసూళ్లు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. రివ్యూలు మరీ గొప్పగా రాలేదు. పబ్లిక్ టాక్ సోషల్ మీడియాలో…
పోలవరం జిల్లాలో తాజాగా జరిగిన పరిషత్ ఎన్నికలలో జనసేన పూర్తిగా ఇరుకున పడింది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు ప్రజలు జేజేలు…
తెలుగునాట అతి పెద్ద పండగల్లో దీపావళి ఒకటి. సెలవులు ఎక్కువ ఉండకపోయినా సెలబ్రేషన్స్ పీక్స్ లో ఉంటాయి. ముఖ్యంగా టపాసుల…
ఒక మార్పు మనిషినే కాదు.. రాజకీయాలను కూడా మార్చేస్తుంది. అమరావతికి కట్టుబడి ఉంటామని.. అమరావతి రాజధానిని మార్చబోమని.. అసలు అమరావతి…