రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ, ఈ విషయంలో వైసీపీ అదినేత జగన్.. ఆది నుంచి తప్పులపై తప్పులు చేస్తూనే ఉన్నారన్న టాక్ సొంత పార్టీలోనే వినిపిస్తోంది. కొన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చి.. వారి ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఆది నుంచి కూడా వైసీపీకి వికటించాయి. ఈ విషయంలో విజయవాడ, గుంటూరు వంటి అనేక జిల్లాల్లో ప్రధాన ఉదాహరణలు ఉన్నాయి.
బలమైన ఆళ్ల రామకృష్నారెడ్డిని పక్కన పెట్టి బీసీ నాయకురాలిగా మురుగుడు లావణ్యకు మంగళగిరిలో టికెట్ ఇచ్చారు. ఇది విఫలమైంది. ఆమె ఓడిపోయిన తర్వాత.. నియోజకవర్గాన్ని కూడా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. విజయవాడ కార్పొరేషన్ మేయర్ పదవిని జనరల్ కు కేటాయిస్తే.. అలా కాదు.. బీసీకే ఇస్తానని పట్టుబట్టి.. బీసీ మహిళకు ఇచ్చారు. ఆమె పరిస్థితి ఇప్పుడు మైనస్‌గా మారింది. అసలు విజయవాడ నగర మేయర్‌గా చేసిన వారికి ప్రత్యేకముద్ర ఉంది. కానీ.. వైసీపీ తరఫున చేసిన రాయన భాగ్య లక్ష్మిని ఎవరు గుర్తు కూడా పెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది.
అలాగే.. గత ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సీటును లారీ డ్రైవర్‌కు ఇచ్చారు. అక్కడ కూడా విఫలమయ్యారు. అదేమంటే అట్టడుగు వర్గాలకు అవకాశం ఇస్తున్నామని.. ఇది తాము మాత్రమే చేసిన పనిగా జగన్ చెప్పుకొచ్చారు. కానీ,, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్నికల విజయం ముందు అవి నిలబడనప్పుడు.. ప్రయత్నించి వృథానేనని అంటున్నారు. పోనీ.. ఇప్పుడైనా ఆయన పనితీరు మారుతోందా? అంటే.. అది కూడా లేదని సొంత పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఏం చేయాలి.. ?
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వైసీపీ ముందుచూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సామాజిక వర్గాలను కాపాడుకుంటూనే.. నాయకుల స్థితిగతులను కూడా అంచనా వేయాలి. స్థానిక ఎన్నికలకు ముందుగానే ఈ ప్రక్రియ చేయాలన్న డిమాండ్లు పార్టీలో పెరుగుతున్నాయి. చాలా చోట్ల నియోజకవర్గ సమన్వయ కర్తలకు సీనియర్లకు మధ్య అగాధాలు పెరుగుతున్నాయి. వీటిని పరిష్కరించేదిశగా కొత్త నాయకులకు.. బలమైన నేతలకు అవకాశం ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీకి ఆశించిన ఫలితం దక్కక పోవచ్చని అంటున్నారు.
This post was last modified on October 11, 2026 9:45 pm
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…