Movie News

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో కామెడీ ఎంటర్టైనర్లతో ఆకట్టుకున్నాడాయన. ఐతే శ్రీను వైట్లతో పాటు ఆయనా ఒకేసారి ఫామ్ కోల్పోయారు. వీళ్ల కామెడీ ఔట్ డేట్ అయిపోయి ఇద్దరూ ఫేడ్ అవుట్ అయిపోయారు. శ్రీను వైట్లకు దూరం జరిగి కోన సొంతంగా చేసుకున్న సినిమాలు కూడా ఏవీ ఆడలేదు. అదే సమయంలో ఆయన చూపు రాజకీయాల మీద పడింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టారు. ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడంతో ఆయన మీద ఎక్కడలేని వ్యతిరేకత వచ్చింది. కోన రాజకీయాల్లోకి వెళ్లడం తప్పు కాదు కానీ.. తన సోల్ మేట్ అని చెప్పుకున్న వ్యక్తి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన నైతికతను ప్రశ్నించేలా చేశాయి. వైసీపీ అధికారంలో ఉండగానే సోషల్ మీడియాలో తీవ్రమైన నెగెటివిటీ ఎదుర్కొన్న కోన.. ఆ పార్టీ ఓటమి తర్వాత మరింతగా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

ఆ దెబ్బకు రాజకీయాల గురించి మాట్లాడ్డం మానేశారు కోన. నెమ్మదిగా వైసీపీతోనూ కనెక్షన్ తెంచుకున్నారు. మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టారు. అయినా కూడా సోషల్ మీడియాలో ఆయన మీద వ్యతిరేకత తగ్గలేదు. దీంతో సోషల్ మీడియాలో కోన కామెంట్ సెక్షన్ డిజేబుల్ చేసుకోవాల్సి వచ్చింది. రీఎంట్రీలో కోన అసోసియేట్ అయిన గీతాంజలి మళ్ళీ వచ్చింది, బ్యాండ్ మేళం లాంటి సినిమాలు బాగా దెబ్బ తిన్నాయి. వాటి కంటెంట్ కూడా వీకే అయినప్పటికీ.. కోన మీద ఉన్న నెగెటివిటీ కూడా వాటికి మైనస్ అయింది. ఐతే ఇప్పుడు కోన మీద క్రమంగా నెగెటివిటీ తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మెగా అభిమానులు ఇంతకుముందులా ఆయన్ని ఎటాక్ చేయట్లేదు.

ముఖ్యంగా కోన స్క్రీన్ ప్లే అందిస్తూ ప్రెజెంటర్‌గా వ్యవహరించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మెగా అభిమానుల నుంచి సపోర్ట్ కూడా లభిస్తోంది. ఇందులో ‘ఆచార్య’ సినిమా మీద పంచ్ వేసినా.. తేలిగ్గానే తీసుకున్నారు. ఆ డైలాగ్ చిరుకు చెప్పే పెట్టారని తెలియడంతో వివాదానికి స్కోప్ లేకపోయింది. ఫ్యాన్స్ దీన్ని స్పోర్టివ్‌గానే తీసుకుంటున్నారు. ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ రావడానికి చిరు కారణమని కోన చెప్పడం కూడా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తోంది.

ఇక ‘కామ్రేడ్ కళ్యాణ్’ ప్రమోషన్లలో భాగంగా కోన మాట్లాడుతున్న మాటలు సెన్సిబుల్‌గా ఉంటున్నాయి. నిర్మాతలతో అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టించే దర్శకులు క్రిమినల్స్ అని, అలాంటి వాళ్లను బ్యాన్ చేయాలని కోన చేసిన కామెంట్‌కు సానుకూల స్పందన వచ్చింది. అలాగే స్టార్ హీరోలు వేగంగా సినిమాలు చేయడం ఇండస్ట్రీకి ఎంత అవసరమో కోన చెప్పిన తీరు కూడా ప్రశంసలు అందుకుంటోంది. తన మీద నెగెటివిటీ తగ్గిన విషయాన్ని గుర్తించిన కోన ఈ మధ్యే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేశారు. ఇంతకుముందులా ఆయన మీద ఎటాక్స్ ఏమీ జరగట్లేదు. మొత్తానికి మెగా అభిమానుల్లో కోన మీద కోపం తగ్గినట్లే కనిపిస్తోంది.

This post was last modified on October 11, 2026 2:54 pm

Share

Recent Posts

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

11 minutes ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

43 minutes ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

4 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

4 hours ago

రణబాలికి కాంతార రంగు

ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…

5 hours ago

పవన్ పాలనకు చిరు కితాబు

తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…

7 hours ago