సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు కాంగ్రెస్ సహా పలు బీజేపీ వ్యతిరేక పార్టీలు, సామాజిక కార్యకర్తలు, యువత, విద్యార్థులు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. భారత్ లో కూడా నేపాల్ తరహాలో జెన్ జీ ఉద్యమం వచ్చిందని, కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అదే మాదిరిగా ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ కూడా రాజీనామా చేయక తప్పదని అంటున్నారు.
అయితే, దేశంలోని యువత ఈ తరహా జెన్ జీ ఉద్యం చేయాలని, బీజేపీని తరిమికొట్టాలని తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్ది సంవత్సరాల క్రితమే చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆయన చెప్పినట్లే యువత ముదుకు వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వైనాన్ని బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కేసీఆర్ పాత వీడియోను వైరల్ చేస్తున్నారు. దేశంలో జీడీపీ పతనమైందని, రూపాయి విలువ పతనమైందని, ఇంకా కాబోతోందని కొన్నేళ్ల క్రితమే కేసీఆర్ జోస్యం చెప్పారు ఆ వీడియోలో. తాను చెబుతున్నవన్నీ కఠోర వాస్తవాలని కేసీఆర్ అప్పట్లోనే చెప్పారు.
దేశంలోని యువత, విద్యార్థులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు కలిసికట్టుగా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కదం తొక్కాలని కేసీఆర్ గతంలోనే పిలుపునిచ్చారు. ఆ పిలుపునకు తగ్గట్లుగానే ఇప్పుడు ఢిల్లీలో వారంతా కలిసి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఒక్కచోట చేరారు. ఇక, విదేశీ మారకం విలువ కూడా భారీగా పతనమవుతోందని, కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాల వల్లే ఇలా జరుగుతోందని కేసీఆర్ గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, దానిని కాపాడుకునేందుకు వారంతా ముందుకు రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇలా కేసీఆర్ చెప్పింది జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు తమ నేత ముందు చూపు ఇదీ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ కలిపి కూటమిగా ఏర్పాటు చేయాలని మొట్టమొదట ప్రయత్నించింది కూడా కేసీఆర్ అని గుర్తు చేస్తున్నారు
This post was last modified on October 10, 2026 1:54 pm
ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…
నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని ... ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…
అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…