యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు చేస్తున్న హౌతీ రెబల్స్‌కు ఇరాన్ మద్దతు ఇస్తోంది. కొంతకాలంగా యెమెన్ ప్రభుత్వ దళాలకు, హౌతీ రెబల్స్ కు మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలోనే సౌదీలోని విమానాశ్రయాలు, చమురు సంస్థలే టార్గెట్ గా హౌతీలు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఢిల్లీ నుంచి సౌదీలోని రియాద్ బయలుదేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం అర్ధాంతరంగా వెనక్కి వచ్చేసింది.
ఢిల్లీ నుంచి రియాద్ బయలుదేరిన ఫ్లైట్ గుజరాత్ మీదుగా అరేబియా సముద్రం దాటుతున్న విమానం హఠాత్తుగా వెనుదిరిగింది. అయితే, రియాద్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఈ ఫ్లయిట్ క్యాన్సిల్ చేశామని ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు. ప్రయాణికులకు టికెట్ ఛార్జీలు రిటర్న్ ఇస్తామని తెలిపారు. నిన్న మధ్యాహ్నం రియాద్ ఎయిర్ పోర్ట్ ను అక్కడి అధికారులు తాత్కాలికంగా మూసి వేశారు.
రియాద్ లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై బాలిస్టిక్ మిస్సైళ్లతో హౌతీలు దాడి చేయగా…అక్కడ నిలిపి ఉంచిన సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్రంగా దెబ్బతింది. రన్‌వే సమీపంలో పార్క్ చేసి ఉన్న విమానం కాలిపోయింది. అయితే, ఆ సమయంలో సిబ్బంది, ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. గత వారం రోజుల వ్యవధిలో సౌదీ విమానాశ్రయాలపై జరిగిన హౌతీ జరిపిన వరుస దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించగా దాదాపు 36 మంది గాయపడ్డారు.
ఈ ఉద్రిక్తతలు నేడు మరింత తీవ్రతరం కావడంతో రియాద్ విమానాశ్రయయంలో వందలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లు రియాద్‌కు తమ సర్వీసులను రద్దు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ నుంచి రియాద్ బయలుదేరిన విమానం మార్గమధ్యం నుంచే వెనుదిరిగింది. సౌదీ వైమానిక పరిధిని ఉపయోగించవద్దని అంతర్జాతీయ సంస్థలకు హౌతీలు లాస్ట్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో నేటి నుంచి అక్టోబర్ 10 వరకు రియాద్ కు సర్వీసులు నిలిపివేశారు. ఈ క్రమంలోనే రియాద్‌లోని భారతీయులను, ప్రయాణికులను అప్రమత్తంగా ఉండాలని రియాద్ లోని భారత రాయబార కార్యాలయం సూచించింది.
This post was last modified on October 9, 2026 4:36 pm
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…