ఏపీ ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. ఏపీలో పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలతో పాటు రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనుల పర్యవేక్షణ, తన మంత్రిత్వ శాఖల నిర్వహణ…ఇలా క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంటారు లోకేశ్. దీంతోపాటు, తన నియోజకవర్గం మంగళగిరిపై కూడా ఫోకస్ పెట్టేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుంటారు లోకేశ్. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ…ఒక పేరెంట్ గా లోకేశ్ తన తనయుడు దేవాన్ష్ స్కూల్లో పేరెంట్ప్ టీచర్ మీటింగ్ కు హాజరైన వైనంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
తన భార్య నారా బ్రాహ్మణితో కలిసి నారా దేవాన్ష్ స్కూల్లో పేరెంట్స్-టీచర్ మీటింగ్ కు సాధారణ వ్యక్తిలా హాజరయ్యారు లోకేశ్. వీవీఐపీ హోదా ఉన్న లోకేశ్… ఎటువంటి హంగామా లేకుండా సాదా సీదాగా ఆ మీటింగ్ కు హాజరయ్యారు. టీచర్లను దేవాన్ష్ ఎలా చదువుతున్నాడు అని అడిగి తెలుసుకున్నారు.
సాధారణంగా చాలామంది తండ్రులు తమ ఉద్యోగ, వ్యాపార రీత్యా పేరెంట్స్ టీచర్స్ మీటింగుకు హాజరు కారు. పిల్లలు తమ తల్లితో ఈ మీటింగులకు హాజరవుతుంటారు. కానీ, లోకేశ్ వంటి హై ప్రొఫైల్ వ్యక్తి కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రాధాన్యతను చాటిచెప్పేలా ఆ మీటింగ్ కు హాజరు కావడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
పిల్లల చదువులో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని లోకేశ్ అన్నారు. పితృత్వం అనే భావన ఎంతో మ్యాజికల్ అని లోకేష్ చెప్పారు. ప్రస్తుతం ఆ పీటీఎంకు లోకేశ్, బ్రాహ్మణి హాజరైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక, ఏపీ విద్యాశాఖ మంత్రి అయిన లోకేశ్…ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మెగా పీటీఎంలు నిర్వహిస్తూ విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులకు నాంది పలికిన సంగతి తెలిసిందే.
నారా లోకేష్ మరియు బ్రాహ్మణి తమ కుమారుడి పేరెంట్స్-టీచర్ మీటింగ్ కి హాజరైన సందర్భానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత ఏడాది కూడా లోకేశ్ దేవాన్ష్ స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగుకు హాజరయ్యారు. ఇలా బిజీ షెడ్యూల్ ను సైతం పక్కనబెట్టి తన తనయుడు ఎలా చదువుతున్నాడు అని స్వయంగా తెలుసుకోవాలని ఆ మీటింగుకు హాజరైన లోకేశ్ మరెందరో తండ్రులకు ఆదర్శప్రాయం అని చెప్పవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates