అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి వస్తోంది. ఒకపక్క మొన్న గాంధీ జయంతికి వచ్చిన కొత్త రిలీజులు అన్నీ టపా కట్టేయడంతో కొత్త వాటి కోసం థియేటర్లు ఎదురు చూస్తున్నాయి. వెంకటేష్ ఎలాగూ తప్పుకున్నారు కాబట్టి ఆ ఛాన్స్ వాడుకునేందుకు శ్రీవిష్ణు రంగంలోకి దిగుతున్నాడు. తను స్వయానా వెంకీ వీరాభిమాని కావడం గమనించాల్సిన విషయం. అంటే గురువు బ్లెస్సింగ్స్ శిష్యుడికి దొరికాయన్న మాట.
ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఒక ఊరిలో థియేటర్ మీద జీవనం కొనసాగిస్తూ ఉంటాడు కళ్యాణ్ (శ్రీవిష్ణు). అతని తల్లి (రాధిక)కి బాలకృష్ణ అంటే ప్రాణం. ఉద్యోగం మీద అక్కడికి వచ్చిన ఒరియా కుటుంబంలోని అమ్మాయి (మహిమ నంబియార్)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు కళ్యాణ్. ఒక పోలీస్ ఆఫీసర్ (షైన్ చాం టాకో) వల్ల కళ్యాణ్ మాములు యువకుడు కాదు నక్సలైటని తెలుస్తుంది. అక్కడి నుంచి కథ రకరకాల మలుపులు తిరిగి రసవత్తరంగా మారుతుంది.
కొంతం తీక్షణంగా గమనిస్తే పవన్ కళ్యాణ్ జల్సానే తిరగమోత వేసి కొత్త ట్రీట్ మెంట్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో సరదాగా సాగే యువకుడు, గతంలో అతని నక్సలైట్ నేపధ్యం, వెంటపడే పోలీస్ అధికారి ఇలా పోలికలైతే ఉన్నాయి. స్టోరీ ఒకటే అని చెప్పడం లేదు కానీ టైటిల్ నుంచే కంపారిజన్లు వస్తాయి కాబట్టి ఈ మాత్రం గుర్తుకు రావడం సహజం శ్రీవిష్ణు మార్కు కామెడీతో పటు తన వన్ లైనర్లకుఈసారి సత్య తోడవ్వడంతో నవ్వులు బాగా పండించే ఛాన్స్ ఉంది.
కాంపిటీషన్ పెద్దగా లేకపోవడం కామ్రేడ్ కళ్యాణ్ కు కలిసి వస్తుంది. సరిగ్గా దసరా సెలవుల టైంలో వస్తోంది కాబట్టి టాక్ కనక పాజిటివ్ తెచ్చుకుంటే వసూళ్లు బాగుంటాయి. దర్శకుడు జానకీరామ్ మారెళ్ల పూర్తిగా వినోదం మీద ఆధారపడినా కాస్తంత యాక్షన్ టచ్ ఇవ్వడం గమనించవచ్చు. ఉపేంద్ర లిమయే లాంటి హాస్య నటులను గట్టిగానే పెట్టారు. 2026లో రెండు చేదు ఫలితాలు చూసిన శ్రీవిష్ణుకి ఈ కామ్రేడ్ కళ్యాణ్ హిట్ చాలా అవసరం. దీని తర్వాత సంక్రాంతికి ఫ్యామిలీ ప్యాక్ తో పలకరించబోతున్నాడు.
This post was last modified on October 6, 2026 5:03 pm
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…
ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…