నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూటమి మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన పార్టీల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం పెను సంచలనానికి దారి తీసింది. పార్లమెంట్ పరిధిలోని భీమవరం మున్సిపల్ ఎన్నికల సీట్ల కేటాయింపు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో కలకలం రేపాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీకి కనీస సమాచారం ఇవ్వకుండా టీడీపీ, జనసేన పార్టీలు ఏకపక్షంగా అభ్యర్థుల జాబితాలను ప్రకటించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి పార్టీల నాయకులకు గౌరవం లేకపోతే సహించబోమని హెచ్చరించారు. కూటమిలో బీజేపీకి తగిన గౌరవం ఇవ్వకపోతే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. దీంతో అసలు ఇక్కడ ఏం జరిగిందన్న విషయం ఆసక్తిగా మారింది. భీమవరం మున్సిపాలిటీలోని మొత్తం 52 వార్డుల్లో బీజేపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నది భూపతి రాజు ఆవేదన. కేవలం కేంద్ర మంత్రి నివాసం ఉన్న ప్రాంతాలకే బీజేపీని పరిమితం చేశారని ఆయన వాపోతున్నారు. అదేసమయంలో సీనియర్ నేతలకు అవకాశం ఇవ్వకుండా విస్మరించారని అంటున్నారు.
సీట్ల కేటాయింపులో బీజేపీ సీనియర్ నాయకులను కూడా విస్మరించారని మంత్రి విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ కుమారుడికి కూడా ఎన్నికల్లో అవకాశం కల్పించకపోవడంపై బీజేపీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయని అంటున్నారు. వాస్తవానికి పాకాకుమారుడి వ్యవహారం ఇటీవలే తెరమీదికి వచ్చింది. కానీ.. ఇంతలోనే పార్టీలు అక్కడ అభ్యర్థిని ప్రకటించాయి. ఈ విషయంపై తనతో చర్చించలేదన్నది భూపతి వారి ఆవేదన. పైగా.. స్థానికంగా కూడా నాయకులకు-భూపతిరాజుకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇవి కూడా ఆయనను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.
ఈ నెల 26న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా నరసాపురం, మొగల్తూరు, ఆచంట మండలాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. నరసాపురం 6వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో కేంద్ర మంత్రి స్వయంగా ఇంటింటా ప్రచారం చేసినప్పటికీ, వైఎస్సార్సీపీ అభ్యర్థి చేతిలో బీజేపీ అభ్యర్థి 222 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ పరిణామాల మధ్య ఇప్పుడు మున్సిపల్ సీట్ల కేటాయింపుపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే.. కూటమి నాయకులు వీటిని లైట్ తీసుకోవడం గమనార్హం.
This post was last modified on November 17, 2026 11:36 pm
మహావతార నరసింహ.. గత ఏడాది పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా. ఈ యానిమేషన్ మూవీ రిలీజయ్యే…
టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో వెంకీ కుడుముల పేరు ఖచ్చితంగా ఉంటుంది. రష్మిక మందన్న ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే ఛలో…
మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఇంటికి వెళ్లేందుకు ఆటోలో లిఫ్ట్ ఇస్తామని నమ్మించిన ఇద్దరు…
ప్రపంచ టెక్ రంగంలో సంచలనం సృష్టించిన ఎన్విడియా మాజీ సీఈవో జెన్సెన్ హువాంగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. వివాహేతర…
బంధువులను రైలు ఎక్కించడానికి వెళ్లినవాళ్లు అనుకోకుండా అదే రైలులో ప్రయాణించాల్సి వచ్చింది. పైగా టికెట్లు లేకపోవడంతో ఏకంగా రూ.36,140 చెల్లించాల్సి…
మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ మీదే కాదు స్టేజి పైన ఉన్నప్పుడు కూడా ఆయన ఎనర్జీ వేరే లెవెల్ లో ఉంటుంది.…