వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. విచారణను ఎదుర్కొనాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎలాంటి మధ్యంతర ఉపశమనం కల్పించబోమని పేర్కొంది. భూముల ఆక్రమణలు సర్వసాధారణంగా మారిపోయాయని.. శ్మశానాలు, దేవాలయ, మఠాల భూములను కూడా ఆక్రమించు కుంటున్నారని.. ఇలాంటి వారికి న్యాయ వ్యవస్థ మద్దతు పలకదని స్పష్టం చేసింది. మీపై వచ్చిన ఆరోపణలు రాజకీయం అంటున్నప్పుడు.. వారిని ఎదుర్కొనే బాధ్యత మీపైనే ఉంటుంది. విచారణను ఎదుర్కోండి అని వ్యాఖ్యానించింది.
ఏంటి వివాదం..
తిరుపతిలోని మారుతీనగర్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసానికి ఆనుకుని ఉన్న సుమారు 3.88 ఎకరాల బుగ్గమఠం భూములను ఆయన ఆక్రమించారని టీడీపీ నేతలు, మఠం నిర్వాహకులు గతంలో ఆరోపించారు. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు.. ఈ భూముల్లో పెద్దిరెడ్డి కార్యాలయం, వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారని, సీసీ రోడ్డు వేసారని అధికారులు గుర్తించారు.
అనంతరం. ఈ భూములను ఖాళీ చేయాలని దేవాదయ అధికారులు పెద్దిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. అనంతరం.. ప్రభుత్వం కూడా కలెక్టర్ ద్వారా ఖాళీ చేయించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. పెద్దిరెడ్డి గత ఏడాదే దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆరు మాసాలకు పైగా జరిగిన విచారణలో హైకోర్టు.. పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. సంబంధిత భూముల రికార్డులను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించింది. దీనిపై తదనంతరం ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
తాజాగా సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. బుగ్గమఠం భూముల వ్యవహారంలో తాము జోక్యం చేసుకునేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దేవాదాయ, ధర్మాదాయ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ ధర్మాసనం స్పష్టం చేసింది. తప్పులేనప్పుడు విచారణను ఎదుర్కోవడంలో సందేహం ఎందుకని ప్రశ్నించింది. దీంతో పెద్దిరెడ్డికి భారీ షాక్ తగిలినట్టు అయింది.
This post was last modified on October 6, 2026 1:00 pm
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…
నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…
సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…
ఒకప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియన్ ఫిలిం మేకర్స్ ఆలోచించడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత…
మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…
కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని అనుకునేవారు.. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…