Movie News

ఇండియా నం.1 డైరెక్టర్ రమ్మన్నా పోని ఓదెల

ఇప్పుడు దర్శకులుగా వెలుగొందుతున్న చాలామంది.. మెగా ఫోన్ పట్టడానికి ముందు అనేక కష్టాలు పడ్డవాళ్లే. అసిస్టెంట్ డైరెక్టర్లుగా, రైటర్లుగా ఎన్నో ఇబ్బందులు పడి, వాటిని దాటితేనే దర్శకులుగా అవకాశం వస్తుంది. తాను కూడా అందుకు మినహాయింపు కాదని అంటున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఐతే తాను కోరి కష్టాలు తెచ్చుకున్న విషయాన్ని శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ఇండియాలోనే నంబర్ వన్ అనదగ్గ ఒక దర్శకుడి దగ్గర చాలా ఏళ్ల ముందే మంచి జీతంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసే అవకాశం వచ్చినా తాను వదులుకున్నట్లు శ్రీకాంత్ తెలిపాడు. ఆ దర్శకుడి దగ్గర ఒక సిచువేషన్ తలెత్తి, అత్యవసరంగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కావాల్సి వచ్చిందని, అప్పుడు 50 వేల రూపాయల జీతం ఇస్తా, ఏడీగా వచ్చేయమని ఆ పెద్ద దర్శకుడు తనకు ఆఫర్ ఇచ్చాడని.. ఆ రోజుల్లో అంత మొత్తం జీతం అంటే పెద్ద విషయం అని.. కానీ తాను మాత్రం సుకుమార్ దగ్గరే పని చేస్తా అని చెప్పి ఆ ఆఫర్‌ను తిరస్కరించానని శ్రీకాంత్ వెల్లడించాడు.

ఇక సుకుమార్ దగ్గర అవకాశం కోసం తాను ఎంత కష్టపడింది కూడా శ్రీకాంత్ ఓదెల వెల్లడించాడు. ముందుగా ‘ఆర్య-2’ సినిమా తర్వాత సుకుమార్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌లో కలిసినట్లు శ్రీకాంత్ తెలిపాడు. ఆ తర్వాత మూడేళ్ల పాటు సుకుమార్ ఇంటి దగ్గర తెల్లవారుజామునే 5 గంటలకు వెళ్లి నిలబడేవాడినని.. ఉదయం గుడ్ మార్నింగ్, రాత్రి ఒంటి గంటకు గుడ్ నైట్ చెప్పేవాడని.. ఇలా మూడేళ్ల పాటు చేశానని.. మూడో సంవత్సరంలో సుకుమార్ పిలిచి ఎవరు నువ్వు, అసలేంట్రా నీ బాధ అని అడిగాడని శ్రీకాంత్ చెప్పాడు.

మీ దగ్గర ఏడీగా పని చేయాలి అని అంటే.. వెళ్లి ఒక షార్ట్ ఫిలిం తీసుకురమ్మాడని.. అప్పుడు తన ఫ్రెండును పెట్టి షార్ట్ ఫిలిం చేశానని.. అది చూశాక తాను ఇప్పుడే వేరే సినిమా చేస్తున్నానని, వేరే చోట ఏడీగా చేరమని సుకుమార్ తెలిపాడని.. కానీ తాను మాత్రం చేస్తే మీ దగ్గరే పనిచేస్తా అని తేల్చి చెప్పినట్లు శ్రీకాంత్ వెల్లడించాడు.

అలా అప్పటికే షూటింగ్ నడుస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి ఏడీగా పని చేయడం మొదలుపెట్టానని.. తర్వాత ‘రంగస్థలం’ మూవీకి పూర్తి స్థాయిలో మొదట్నుంచి చివరి వరకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశానని శ్రీకాంత్ తెలిపాడు. సుకుమార్ దగ్గర రెండు సినిమాలకే పని చేస్తానని ముందే చెప్పానని.. తర్వాత కూడా కంటిన్యూ అవ్వమని అడిగినా సరే, తాను లేదని చెప్పి బయటికి వచ్చేశానని.. కథ రాసుకుని నిర్మాత సుధాకర్ చెరుకూరిని కలిస్తే.. ఆయన ద్వారా నాని పరిచయం అయి ‘దసరా’ సినిమా పట్టాలెక్కిందని శ్రీకాంత్ ఓదెల వెల్లడించాడు.

This post was last modified on October 8, 2026 7:47 am

Share

Recent Posts

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

1 hour ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

3 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

4 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

4 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

5 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

5 hours ago