Political News

సుబ్బులక్ష్మిని తలచుకుని నిర్మలమ్మ కంటతడి

ప్రముఖ కర్ణాటక సంగీత విదుషి ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి స్మారక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భావోద్వేగానికి గురయ్యారు. సుబ్బులక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బులక్ష్మి ఐక్యరాజ్యసమితిలో 1966లో ఆలపించిన ‘మైత్రీం భజత’ను మరోసారి ఆలపించడంతో నిర్మలా సీతారామన్‌ కంటతడి పెట్టారు. సుబ్బులక్ష్మి సంగీతం కేవలం ఒక ప్రదర్శన కాదని.. మెరుగైన ప్రపంచం కోసం చేసిన ప్రార్థన వంటిదని ఆమె పేర్కొన్నారు.

సుబ్బులక్ష్మి సంగీతం ప్రజలకు ఆశ, ఓదార్పును అందించడంతోపాటు ఉమ్మడి మానవత్వ భావనను పెంపొందించిందని నిర్మలా సీతారామన్‌ అన్నారు. భక్తి భారతీయ శాస్త్రీయ సంగీతానికి జీవనాడి వంటిదని.. వివిధ ఆధ్యాత్మిక సంప్రదాయాలను ఏకం చేసే శక్తి సంగీతానికి ఉందని పేర్కొన్నారు. సుబ్బులక్ష్మి నిరాడంబరత, క్రమశిక్షణ, కఠోర సాధన, సేవాభావాన్ని ఆమె గుర్తుచేశారు.

సుబ్బులక్ష్మి కేవలం సంగీత విద్వాంసురాలు మాత్రమే కాదని.. భారతదేశ సాంస్కృతిక రాయబారిగా ప్రపంచానికి దేశ గొప్పతనాన్ని చాటారని వక్తలు పేర్కొన్నారు. 1966లో ఐక్యరాజ్యసమితి వేదికపై ఆమె ఆలపించిన ‘మైత్రీం భజత’ భారతదేశ శాంతి, సామరస్య సందేశాన్ని ప్రపంచానికి వినిపించిన చిరస్మరణీయ ఘట్టంగా అభివర్ణించారు. ఆమె గానం మతం, ప్రాంతం, భాష వంటి సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా శ్రోతల హృదయాలను తాకిందన్నారు.

This post was last modified on September 17, 2026 9:36 am

Share

Recent Posts

మరో విమానంలో సీరియస్ సిగ్నల్స్

విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…

7 hours ago

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

10 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

11 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

11 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

13 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

15 hours ago