సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది. ఇప్పటికే అభిమానుల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. సహజంగా బ్లాక్ బస్టర్స్ సీక్వెల్స్ కి సహజంగా ఉండే విపరీతమైన హైప్ జైలర్ విషయంలో అంతగా కనిపించడం లేదు. ఎందుకంటే పుష్ప, కెజిఎఫ్, కాంతార లాగా దీనికి ఖచ్చితమైన కొనసాగింపు కావాలనే తరహాలో మొదటి భాగాన్ని క్లోజ్ చేయలేదు కాబట్టి. కొడుకుని చంపాక సరైన ఎండింగ్ తో ముగించేశారు.
ఇవాళ ట్రైలర్ వచ్చింది. ఎక్కుడ డీటెయిల్స్ రివీల్ చేయకుండా జాగ్రత్తగా కట్ చేశారు. ముత్తువేల్ పాండియన్ కోసం విలన్లు తెగ వెతుకుతూ ఉంటారు. అతనేమో ఎవరికి దొరక్కుండా వేరే ఊరికి వెళ్ళిపోయి క్యాబ్ నడుపుకుంటూ ప్రశాంతంగా ఉంటాడు. ఎలాగైతేనేం ఫైనల్ గా డాన్ల బ్యాచుకి ముత్తువేల్ ఆచూకీ దొరుకుతుంది. అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న ఈ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ తన విశ్వరూపం బయటికి తీసి విధ్వంసం మొదలుపెడతాడు. అది తెరమీద చూడాలి.
జెన్యూన్ గా చెప్పాలంటే జైలర్ 2 మీద విపరీతమైన ఎగ్జైట్ మెంట్ వచ్చేలా ట్రైలర్ కట్ లేదు. మంచి ఎలివేషన్ షాట్స్ పెట్టారు కానీ ఫ్యాన్స్ కోణంలో చూస్తే అవి సరిపోవు అనేలా ఉన్నాయి. అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమంత స్పెషల్ అనిపించలేదు. కొన్ని విజువల్స్ లో ఏఐ వాడిన వైనం కనిపించేసింది. రజనీకాంత్ లుక్స్. స్టైల్ లో ఎలాంటి మార్పు లేదు. జైలర్ వన్ గెటప్పే కాబట్టి చేంజ్ చేసే రిస్క్ తీసుకోలేదు. ఫ్లాష్ బ్యాక్ ఉండకపోవచ్చు.
సూరజ్, ఎస్జె సూర్య, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, విద్య బాలన్ తదితరులను రివీల్ చేశారు. స్టోరీ లీక్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారో లేక అవుట్ ఫుట్ ఇలా ఉందో ఇప్పుడే చెప్పలేం కానీ సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన అప్పుడే మొదలైపోయింది. సరే ఈ విశ్లేషణల సంగతి ఎలా ఉన్నా ఓపెనింగ్స్ తోనే జైలర్ 2 రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. టాక్ పాజిటివ్ ఉంటే మటుకు తమిళనాడుకి పోటీగా ఏపీ తెలంగాణ వసూళ్లు ఉంటాయి. దీనికి పోటీగా విజయ్ దేవరకొండ రణబాలి నిలుస్తోంది
This post was last modified on October 5, 2026 9:19 pm
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…