పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర తినడం దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఇటీవల బెంగాల్ లో వెజ్ వర్సస్ నాన్ వెజ్ వివాదం జరుగుతుంది. దానికితోడు మధ్యప్రదేశ్ లోని బాగేశ్వర్ ధామ్ పిఠాధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఉరఫ్ బాగేశ్వర్ బాబా దుర్గా పూజ, నవరాత్రుల సమయంలో మాంసాహారం, చేపలు తినకూడదని పిలుపునివ్వడంతో స్థానిక బెంగాలీల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్షాలు సైతం బాబా పిలుపును ఖండించడంతో రాజకీయ రంగు పులుముకుంది. దీంతో బీజేపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది.
దీనికి ఫుల్ స్థాప్ పెట్టేందుకు ముఖ్యమంత్రి సువేందు కాళీ ఘాట్ ఆలయాన్ని సందర్శించారు. కాళీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో కింద కూర్చొని అమ్మ వారికి సమర్పించిన చేప తల, వేయించిన చేప, బసంతి పులావ్ స్వీకరించారు. ఇది ఎప్పటి నుంచో బెంగాల్ లో వున్న ఆచారం. అయితే ఇప్పుడు దీన్ని తప్పు పడుతూ బాగేశ్వర్ బాబా ప్రకటన ఇవ్వడంతో సమస్య వచ్చి పడింది. బాబా పిలుపును కొందరు సమర్ధిస్తున్నారు. అత్యధికులు మాత్రం ఇది పెద్దల నుంచి వస్తున్న ఆచారం, దీన్ని వ్యతిరేకించడం సమర్ధనీయం కాదంటున్నారు. బెంగాల్ ప్రాంతానికి చెందని ఒక పూజారి బెంగాలీల సంప్రదాయాలను శాసించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సువేందు సనాతన వ్యవహారాల విషయంలో దూకుడుగా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంనే ఆయన హిందూ పండుగల్లో మాంసాహారాన్ని నిషేదించాలని ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. దీన్ని ఆయన ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. గతంలో గో మాంసం విషయంలో కూడా ఇలాంటి వివాదం వచ్చింది. ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు, దుర్గా మాత పూజల సందర్బంగా చేపల కూర తినడంపై వచ్చిన వివాదం పీక్ కు చేరింది. దాంతో ఇక లాభం లేదనుకున్న ఆయన స్వయంగా అమ్మవారికి పూజలు చేసి, చేపల కూర భుజించడంతో వివాదానికి చెక్ పెట్టినట్లయిందని చెప్పవచ్చు. బీజేపీ కూడా సువేందు చర్యను సమర్థించింది. ప్రాంతీయ ఆచారాలను గౌరవించాల్సిన అవసరం వుందని ప్రకటించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates