అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. లడఖ్‌లోని టుర్‌టుక్ నుంచి న్యుబ్రా వెళ్తున్న యూట్యూబర్ సుధీర్ కుమార్‌కు ఎదరుపై ఆసక్తికర అనుభవం ఇది. మొహర్రం సందర్భంగా మార్గంలో ప్రయాణికులకు కొందరు ఉచితంగా షర్బత్ అందిస్తున్నారు. అక్కడ ఓ చిన్నారి సుధీర్‌కు షర్బత్ అందిస్తూ డబ్బులు తీసుకునేందుకు నిరాకరించాడు.
మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని ఓ చిన్నారి యూట్యూబర్ను అడిగినట్లు ఆ వీడియోలో ఉంది. ఈ సందర్భంగా సుధీర్ తనది ఆంధ్రప్రదేశ్ అని చెప్పడంతో.. పక్కనే ఉన్న చిన్నారి ఒక్కసారిగా ‘అమరావతినా?’ అని అడగడం ఆయనను ఆశ్చర్యానికి గురిచేసింది. లడఖ్ వంటి సుదూర ప్రాంతంలో ఓ చిన్నారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.
సామాజిక మాధ్యమాల విస్తరణతో దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సమాచార మార్పిడి ఎంతగా పెరిగిందో ఈ ఘటన చాటి చెబుతోందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. భాషలు, ప్రాంతాలు వేరైనా ఆత్మీయత, అతిథి మర్యాదలు మనుషులను దగ్గర చేస్తాయని పేర్కొంటున్నారు. సుధీర్ కుమార్ ఎదుర్కొన్న ఈ అనుభవానికి సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇదే సమయంలో వైసీపీ మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదనను తీసుకురావడం కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తోంది. దేశానికి ఒక చివర గడ్డకట్టే చలితో ఉండే లడఖ్.. మరో చివర వేడి, తేమతో కూడిన ఆంధ్రప్రదేశ్. భౌగోళికంగానే కాకుండా సంస్కృతీ సంప్రదాయాల్లోనూ ఈ రెండు ప్రాంతాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. అయితే మనుషులను, మనసులను కలిపేది ప్రాంతాలు, భాషలు కాదని.. ఆత్మీయత, అమాయకత్వమేనని లడఖ్‌లో చోటుచేసుకున్న ఓ చిన్న సంఘటన చాటిచెప్పింది. అయితే ఈ విషయం వైసీపీకి ఎందుకు అర్ధం కావడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on September 11, 2026 7:39 am
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…