Movie News

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని స్పష్టమైపోయింది. ఆ సినిమా చెప్పిన ప్రకారం డిసెంబరు 3న రిలీజయ్యేట్లయితే.. దానికి పోటీగా మరే చిత్రాన్ని రిలీజ్ చేసే సాహసం చేసేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా ఆ వీకెండ్ రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుంటున్నాయి వేరే సినిమాలు. ఆల్రెడీ విశ్వక్సేన్ మూవీ ‘లెగసీ’కి డిసెంబరు 4న విడుదల అంటూ డేట్ ఇచ్చినపుడే ఫౌజి విషయంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. 

ఇప్పుడు నాగచైతన్య మూవీ ‘వృషకర్మ’ టీం కూడా అదే డేట్ ఎంచుకోవడంతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇవి కాక హిందీలో రెండు పెద్ద సినిమాలు ఆ రోజు రిలీజయ్యే అవకాశాలున్నాయి. ‘ఫౌజి’ టీం నుంచి స్పష్టత తెచ్చుకున్నాకే మిగతా చిత్రాల మేకర్స్ ధైర్యంగా డేట్లు ప్రకటిస్తున్నారన్నది స్పష్టం. కాబట్టి ‘ఫౌజి’ ఈ ఏడాది రాదన్నట్లే.

ఈ సినిమా వాయిదా పడిందంటే.. మొత్తం ప్రభాస్ నటిస్తున్న, నటించబోయే సినిమాలన్నింటికీ షెడ్యూళ్లు మారబోతున్నట్లే. ఫౌజి కోసం అదనంగా కొన్ని రోజులు ప్రభాస్ పని చేయాల్సి ఉంటుందన్నది స్పష్టం. దీంతో దీనికి సమాంతరంగా చేస్తున్న ‘స్పిరిట్’ షూట్ ఆలస్యం అవుతుంది. ‘ఫౌజి’ ఇప్పుడు మిస్సయిందంటే ఇక మార్చికే రిలీజ్ అని అంటున్నారు. అంటే ‘స్పిరిట్’ ఆ నెలలో రాదన్నది స్పష్టం. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ సినిమాలంటే ఒకదానికి ఇంకోదానికి మధ్య మూణ్నాలుగు నెలలైనా గ్యాప్ ఉండాల్సిందే. కాబట్టి ‘స్పిరిట్’ వేసవిని మిస్సవుతున్నట్లే. 

ఈ రెండు చిత్రాలనూ పూర్తి చేసి వీలైనంత త్వరగా ‘కల్కి-2’ను మొదలుపెట్టాలనుకున్నాడు ప్రభాస్. కానీ ఇప్పుడు ఆ సినిమా మరింత ఆలస్యం కాబోతోంది. వచ్చే ఏడాది ద్వితీయార్దానికి కానీ ప్రభాస్ ఆ మూవీకి కాల్ షీట్లు ఇచ్చేలా లేడు. ఇంకోవైపు ‘సలార్-2’ కూడా మరింత ఆలస్యం అవ్వడం లాంఛనమే. ప్రభాస్‌తో సినిమాలు చేయాలని చూస్తున్న వేరే దర్శకులు, నిర్మాతలు కూడా మరింత కాలం నిరీక్షించక తప్పదు.

This post was last modified on September 11, 2026 8:01 am

Share

Recent Posts

అంబటి కన్ను హోం మంత్రి సీటుపై పడిందా

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నోటి…

1 hour ago

ప్యారడైజ్ కోసం కాచుకుని ఉన్నారు

అనుకున్నట్టే ప్యారడైజ్ ఓటిటి రిలీజ్ సరిగ్గా నాలుగు వారాలకు వచ్చేస్తోంది. ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు నెట్…

3 hours ago

ఇప్పుడు పార్టీ ప్రమోషన్ ఎందుకు సాయిరెడ్డి గారు

ఏపీలో కొత్త పార్టీకి శ్రీకారం చుడుతున్నాన‌ని చెబుతున్న మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయ‌కుడు వి. విజ‌య‌సాయిరెడ్డి తాజాగా మ‌రో…

4 hours ago

అయ్య‌న్న ఇలాకాలో తోడికోడ‌ళ్ల ఫైటింగ్‌

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్.. టీడీపీ సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు కుటుంబానికి మ‌రో కీల‌క ప‌ద‌వి చిక్కింది. ఇప్ప‌టికే…

4 hours ago

బెజవాడ బరిలో ఏబీవీ ఎవరి ఓట్లు చీల్చుతారు?

రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేదు. వైసీపీ హయాంలో సస్పెన్షన్ కు…

5 hours ago

డైరెక్టర్‌ది నా కులమే… అందుకే కథ చెప్పా

తన బుర్రకథ, పాటలతో 80, 90 దశకాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒక ఊపు ఊపేసిన కళాకారిణి గరివిడి లక్ష్మి. ఆ…

6 hours ago