విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు నాయకులు కర్చీఫ్ వేస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ వారసుల కోసం ప్రయత్నాలు చేస్తుంటే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్లు పలువురు మేయర్ పదవిపై ఆశతో అధినేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎవరి రూట్ లో వాళ్ళు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీలో పోటీ తీవ్రంగా వుంది. జనసేన నాయకులు కూడా విజయవాడ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా వున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ కూడా సత్తా చాటేందుకు సిద్ధం అవుతుంది.
రాష్ట్రంలో విజయవాడ మేయర్ పదవి హాట్ కేక్ లాంటిదని చెబుతుంటారు. రాజధాని ప్రాంతం కావడంతో ఈ సీటుకు ఎనలేని ప్రాధాన్యత వుంది. టీడీపీ ఆవిర్భానికి ముందు కమ్యూనిస్టుల ప్రాబల్యం వుండేది. ఆ తర్వాత నుంచి టీడీపీ పెత్తనం కొనసాగుతుంది. తాజాగా విజయవాడలోని మూడు సీట్లు కూడా కూటమి చేతిలోనే ఉండటంతో కార్పొరేషన్ ఎన్నికల్లో సులువుగా విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది . దీంతో పలువురు నాయకులు ఈ పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. సీటంటూ కన్ఫార్మ్ అయితే చాలు విజయం లాంఛనమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు తన కుమారుడు సిద్దార్థ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇటీవల సిద్దార్థ్ తో వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. విజయవాడ మేయర్ పదవి కి సిద్దార్థ్ కు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బయోడేటా కూడా అందజేసినట్లు ప్రచారం జరుగుతుంది. దేవినేని చందు కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్ ను కలవడం కాక పుట్టిస్తుంది. మేయర్ సీటు కోసమే చందు కుటుంబం లోకేష్ ను కలిసినట్లు ప్రచారం జరుగుతుంది. లోకేష్ ను కలిసి వచ్చిన తర్వాత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ‘ఒక మర్యాదపూర్వక కలయిక… ఒక ఆశ’ అని మెసేజ్ పెట్టడం టీడీపీ సర్కిల్ లో చర్చకు దారితీసింది. ఒకరు తండ్రిని కలిసి బయోడేటా అందజేస్తే.. మరొకరు కుమారుడ్ని కలిసి విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా మారింది.
ఈ ఇద్దరే కాకుండా టీడీపీలో చాంతాడంత మంది రేసులో వున్నట్లు ప్రచారం జరుగుతుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మద్దతుతో కొమ్మారెడ్డి పట్టాభి తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ సతీమణి అనురాధ పేరు కూడా బలంగా వీడియో వినిపిస్తుంది. గద్దే కు చంద్రబాబుతో వున్న సాన్నిహిత్యంతో గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. వంగవీటి రాధాకృష్ణ కూడా రేసులో వున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన బహిరంగా ప్రయత్నం చేయనప్పటి అంతర్గతంగా తనకు ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.
కూటమిలో కీలకంగా వున్న జనసేన కూడా విజయవాడ మేయర్ సీటు తమకు కేటాయించాలని అడుగుతునట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ నుంచి తాము తప్పుకున్న విషయాన్ని గుర్తుకు చేస్తున్న జనసేన నాయకులు ఈసారి ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ జనసేనకు కేటాయిస్తే అమ్మిశెట్టి వాసు, పీ. సుబ్బారాయుడులలో ఒకరికి సీటు దక్కవచ్చని సమాచారం.
వైసీపీ కూడా ఇక్కడ తమ పట్టు నిలుపుకోవాలని భావిస్తుంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి దించాలని నిర్ణయం తీసుకుంది. దేవినేని అవినాష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. టీడీపీ నుంచి బోండా సుధీర్ పోటీకి దిగితే వైసీపీ అవినాష్ ను పోటీకి దింపుతుందని, దేవినేని చందును పోటీకి పెడితే వంగవీటి కుటుంబం నుంచి ఒకరిని పోటీకి దింపే ఆలోచన చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఏకపక్ష విజయం అంత సులువు కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on September 10, 2026 1:52 pm
నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా…
అర్జెంటీనాలో జరిగిన ఒక విచిత్ర పరిణామం ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది. రాత్రికి రాత్రే ఒక సముద్రం ఇంకిపోయిందని,…
ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్‌ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి…
ఫౌజీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా పోస్ట్ పోన్ ఖాయమని…
మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో…
కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…