Movie News

సూర్య పాత్రలో షాకింగ్ ట్విస్టుందా?

తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా ఉండేది. అలాగే ప్రేక్షకులు అలాంటి పాత్రలను అంగీకరిస్తారన్న గ్యారెంటీ కూడా ఉండేది కాదు. గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. ‘రంగస్థలం’లో సుకుమార్ తన హీరోను చెవిటివాడిగా చూపించి మెప్పించాక ఇటు ఇండస్ట్రీ దృష్టికోణమే మారిపోయింది.

ఐతే హీరోల పాత్రల విషయంలో ఇలాంటి ప్రయోగాలు చేయడంలో తమిళ ఇండస్ట్రీ చాలా అడ్వాన్స్డ్‌అనే చెప్పాలి. ‘గజిని’లో సూర్య చేసిన పాత్ర.. ‘పితామగన్’లో విక్రమ్ చేసిన క్యారెక్టర్‌ను ఆ రోజుల్లో మన దగ్గర ఊహించే వాళ్లం కాదు. సౌత్ ఇండియన్ సినిమా టాప్ స్టార్లలో ఒకడిగా ఎదిగినప్పటికీ.. సూర్య ఎప్పుడూ తన పాత్రల విషయంలో ప్రయోగాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇలా ఉంటే ప్రేక్షకులు చూడరేమో అనే భయాలు అతడిలో ఎప్పుడూ లేవు. ఈ నేపథ్యంలోనే తన కెరీర్లో మరో ప్రయోగానికి అతడు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

మలయాళ దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న కొత్త చిత్రం ‘సీన్’ టైటిల్ టీజర్‌ను నిన్న రిలీజ్ చేయగా.. అందులో సూర్య పాత్రకు సంబంధించి ఒక షాకింగ్ ట్విస్టు ఉన్నట్లు నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఈ టీజర్లో హీరో పాత్రకు సంబంధించి మొదటి, చివరి షాట్లను గమనిస్తే అతను ఇంకొకరి సాయంతో నడడం గమనించవచ్చు. హీరో అంధుడు కావడం వల్లే అలా ఒకరి సాయంతో నడుస్తున్నాడనే సందేహాలు కలుగుతున్నాయి. టీజర్ అంతా కూడా సూర్య పాత్ర ప్రవర్తన కొంచెం చిత్రంగానే సాగింది. హీరో బ్లైండ్ కావడమే ఆ విచిత్ర ప్రవర్తను కారణం అయ్యుండొచ్చని అనుకుంటున్నారు.

ఇదే నిజం అయితే మాత్రం సూర్య పెద్ద సాహసమే చేస్తున్నట్లు లెక్క. తెలుగులో రవితేజ ‘రాజా ది గ్రేట్’లో బ్లైండ్ క్యారెక్టర్ చేసినా.. అది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో సాగే సినిమానే. కానీ జీతు మాధవన్ సినిమా అంటే రొటీన్‌గా ఉండదు. హీరోను అంధుడిగా చూపిస్తున్నాడంటే కథలో ఏదో మతలబు, ప్రత్యేకత ఉంటాయి. సూర్య లాంటి సూపర్ స్టార్‌ను ఇలాంటి పాత్రలో చూపించి మెప్పించాడంటే.. ‘సీన్’ ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యే అవకాశముంది.

This post was last modified on September 10, 2026 2:23 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

6 minutes ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

43 minutes ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

57 minutes ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

2 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

2 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

2 hours ago