నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా ఉన్నారని కాదు. నెగటివ్ కామెంట్స్ చేసినవాళ్లు లేకపోలేదు. అయితే వాటిలో అధిక శాతం ఉద్దేశపూర్వకంగా విజయ్ దేవరకొండని టార్గెట్ చేసిన వైనం కనిపిస్తోంది. రాయలసీమ యాసని తను పలికే తీరు గురించి మొదట్లో కొన్ని అనుమానాలు తలెత్తాయి. అయితే టీజర్లో వాటికి క్లారిటీ వచ్చేసింది. పొరపాట్లు లేకుండా సీమ భాషని డెలివరీ చేశాడు విజయ్.
ఇంకొందరు పోలికల పర్వానికి తెరతీశారు. నాగార్జున రాజన్న, చిరంజీవి సైరా నరసింహారెడ్డితో మొదలుపెట్టి ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం వచ్చిన అల్లూరి సీతారామరాజు వరకు వెళ్ళిపోయి ఏవేవో కంపారిజన్లు చేస్తున్నారు. స్వాతంత్య్రం రాకముందు నేపధ్యాన్ని ఎవరు తీసుకున్నా సినిమాలోని వాతావరణం ఒకేలా కనిపిస్తుంది. అందులో మేజిక్ చేయడానికి ఏముండదు. ఇంద్రలోకం, నరకం అంటే ఒక టెంప్లేట్ ఎలా ఫాలో అవుతాయో ప్రీ ఇండిపెండెన్స్ కు కూడా అదే వర్తిస్తుంది.
దీన్ని సరిగా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు చూపించే సెన్సిబిలిటీస్ మీదే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు వెంకటేష్ హీరోగా రాఘవేంద్రరావు సుభాష్ చంద్రబోస్ తీశారు. దారుణంగా పోయింది. గతం వర్తమానాన్ని సరిగ్గా బాలన్స్ చేయలేక ఫెయిలయ్యారు. సైరాలో అలాంటి పొరపాట్లు లేవు కాబట్టే ఫ్లాప్ కాకుండా గట్టెక్కింది. ప్రభాస్ ఫౌజీలోనూ ఈ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. షూటింగ్ టైం నుంచే దీని మీద ఎంత పాజిటివ్ బజ్ ఉందో కళ్లారా చూస్తున్నాం.
సో విజయ్ దేవరకొండని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల రణబాలికి వచ్చిన నష్టం ఏమి లేదు. విషయం ఉంటే ఎవరు ఆపాలని చూసినా సినిమా ఆగదు. ప్యాన్ ఇండియా బడ్జెట్ తో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ విజువల్ గ్రాండియర్ లో రష్మిక మందన్న భార్య పాత్రనే పోషించడం గమనార్హం. అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలికి పోటీగా రజినీకాంత్ జైలర్ 2 ఉంది. వారం ముందు వెంకటేష్ ఆదర్శ కుటుంబం వచ్చే అవకాశాలు కొట్టి పారేయలేం.
This post was last modified on September 10, 2026 11:47 am
నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ పోటీ నడుస్తోంది. ప్రస్తుత…
ఇప్పటి స్టార్ హీరోల కెరీర్లు చూస్తున్నాం. జీవిత కాలంలో మహా అయితే ఇరవై నుంచి నలభై సినిమాలు చేస్తే గొప్పనేలా…
ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…
డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…
సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…