తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం రోజే.. రణరంగాన్ని తలపించాయి. పోలీసులు వర్సెస్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల మధ్య జరిగిన వాగ్వాదం.. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇది.. ఏకంగా చొక్కాలు విప్పే వరకు వచ్చింది. మరోవైపు.. తన చీరను లాగారంటూ.. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేసి కంట తడిపెట్టుకున్నారు. ఇక, అసెంబ్లీ గేటు వద్దే.. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడం.. వారిలో కొందరిని అరెస్టు చేయడం జరిగిపోయాయి.
ఎందుకు?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం సంబరాలకు పిలుపునివ్వగా.. ప్రధాన ప్రతిపక్షం.. గన్ పార్కు నుంచి నిరసనగా అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేసింది. దీనిని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు తమపై భౌతిక దాడికి దిగారని కొందరు ఎమ్మెల్యేలు ఆరోపించారు.
మాజీ మంత్రి హరీష్‌రావును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో ఆయన టీషర్టును విప్పేసి పోలీసుల తీరుకు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు.. మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇద్రారెడ్డిలు.. కూడా తమపై పోలీసులు భౌతికంగా దాడి చేశారని ఆరోపిస్తూ.. నిరసనలకు దిగారు. ఈ పరిణామాలతో అసెంబ్లీలో లోపలకన్నా కూడా.. బయటే ఎక్కువగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ ఎస్ పిలుపునిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా.. తమను అడ్డుకుంటున్నారని.. అసెంబ్లీలోకి రాకుండా చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పోలీసుల తీరు దుర్మార్గంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. జగదీష్ రెడ్డికి హైబీపీ ఉందని చెప్పినా అడ్డుకున్నారని, రేవంత్ ఆదేశాలతోనే పోలీసులు రెచ్చిపోయారని అన్నారు. పోలీసులు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
కాగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధరించిన టీషర్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని అందుకే అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు. దీనిపైనా హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. “మా టీషర్ట్ లపై అభ్యంతరకర పదాలెక్కడున్నాయి?. సభకు రాకుండా మమ్మల్ని కావాలనే అడ్డుకున్నారు. మేం సభలో లేనప్పడు 22- Aపై చర్చ ఎలా జరుపుతారు?. కావాలనే మహిళా ఎమ్మెల్యేలపై దాడులు చేశారు. మా సభ్యులను రక్తాలు వచ్చేలా కొట్టారు.“ అని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on September 8, 2026 12:25 pm
ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…
ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…
కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…
సైబర్ నేరాల గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు సహా రిజర్వ్ బ్యాంకు…
చాలా ఏళ్ల నుంచి తమిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒకడు. సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్ తర్వాత…
తెలంగాణలో కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల…