Movie News

చరణ్‌కు తగిలిన దెబ్బే దుల్కర్‌కు తగిలింది

ఎందుకో స్టార్ హీరోలకు ఈ మధ్య ‘గేమ్’ టైటిల్ అచ్చి రావడం లేదు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చేసిన గాయం ఎంత పెద్దదో మెగా ఫ్యాన్స్ అంత సులభంగా మర్చిపోలేరు. విలువైన సంవత్సరాలతో పాటు వందల కోట్ల బడ్జెట్ బూడిదలో పోసిన పన్నీరు కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తాజాగా దుల్కర్ సల్మాన్ ‘ఐయామ్ గేమ్’ విడుదలైన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ ఆర్డిఎక్స్ తీసిన సహస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మొన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

విచిత్రంగా తక్కువ అంచనాలతో వచ్చిన బెత్లెహాం కుటుంబ యూనిట్ మూడు వందల కోట్ల వైపు పరుగులు పెడుతుండగా ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఐయామ్ గేమ్ మాత్రం ఫైనల్ రన్ లోపు వంద కోట్లు టచ్ చేయడమే గొప్పని ట్రేడ్ అంచనా వేస్తోంది. నిజానికి ఈ మూవీ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. చెప్పాలంటే గతంలో వచ్చిన నాగచైతన్య సవ్యసాచిలోని ఒక పాయింట్ తీసుకుని వేరే ట్రీట్ మెంట్ తో రూపొందించి రివెంజ్ ఫార్ములా తగిలించి కొత్తగా చెప్పాలని చూశారు.

అసలు కథగా ఏముందో చూస్తే గ్యాంబ్లింగ్ పిచ్చిలో పడిపోయి కోట్లు పోగొట్టుకున్న ఒక యువకుడు ప్రమాదంలో చేయి కోల్పోతాడు. వేరొకరి శరీరంలోని చేతిని తీసుకొచ్చి ఇతనికి అమరుస్తారు. అయితే దాని వెనుకో దారుణమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న చేయి దుల్కర్ బాడీకి అతుక్కోగానే తన పని మొదలుపెడుతుంది. అసలు స్టోరీ ఇక్కడ నుంచి మొదలై కొత్త మలుపులు తీసుకుంటుంది. వినడానికి కొంచెం వెరైటీగా అనిపించే కాన్సెప్ట్ ఇది.

కానీ సమస్య అంతా సెకండాఫ్ లో వచ్చింది. చేయి ఫ్లాష్ బ్యాక్ మరీ రొటీన్ గా ఉండటం, అవసరానికి మించి నిడివిని సాగదీయడం, నత్త నడక స్క్రీన్ ప్లే మొదలైనవి బాగా డ్యామేజ్ చేశాయి. దీంతో ఫస్ట్ హాఫ్ లో వచ్చిన అంతో ఇంతో పాజిటివ్ ఫీల్ కూడా క్లైమాక్స్ వచ్చేసరికి సున్నా అయిపోతుంది. దీని వల్లే ఐయామ్ గేమ్ పట్ల నెగటివిటీ వచ్చింది. దుల్కర్ మీద నమ్మకంతో తెలుగులో కాస్త డీసెంట్ ఓపెనింగ్ వచ్చినా నిలబడలేదు. అన్నట్టు ఎన్నో ఏళ్ళ క్రితం మంచు విష్ణు చేసిన ‘గేమ్’ కూడా డిజాస్టరే. 

This post was last modified on September 7, 2026 10:18 am

Share

Recent Posts

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

6 minutes ago

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

1 hour ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

1 hour ago

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

1 hour ago

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

2 hours ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

2 hours ago