ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, డిప్యూటీసీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ల జోడీకి ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతోంది. 2024 ఎన్నికలకు ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో చేతులు కలిపిన వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం, స్నేహం రోజు రోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. కూటమిగా అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ కార్యకర్తల మధ్య మనస్పర్థలు ఉన్నా హై కమాండ్ మధ్య సఖ్యత కూడా బాగానే ఉంది. ఇక, సీఎం, డిప్యూటీ సీఎంలు.. సుమారు నాలుగు మాసాల తర్వాత.. కలిసి ఒకే వేదిక పంచుకున్నారు. నెల్లూరు కేంద్రంగా జరిగిన పల్లె పండుగ – 3.0 కార్యక్రమానికి కలిసి హాజరయ్యారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కాకొల్లువారిపాలెంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కింద.. రూ.11,085 కోట్లతో గ్రామీణాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే మరికొన్ని పనులకు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ నిధుల్లో కేంద్రం 5వేల కోట్ల రూపాయల పైచిలుకు మొత్తాన్ని ఇవ్వగా, రాష్ట్ర సర్కారు తన వంతుగా అంతే మొత్తాన్ని జమ చేసింది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అబివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది.
ఇక, ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎంలు సభా వేదిక మీదకు రాగానే సభికుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. తమ మెడలో వేసుకున్న కండువాలను గాల్లో ఊపుతూ ఉవ్వెత్తున రైతులు, గ్రామస్థులు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. అలాగే, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై సీఎం, డిప్యూటీ సీఎం నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. ఈ సమయంలో అయితే.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని చూసి యువత సహా మహిళలు ఆనందంతో డ్యాన్సులు చేశారు. అంతేకాదు.. సీఎం, డిప్యూటీ సీఎం ర్యాంప్ వాక్‌ను తమ తమ ఫోన్లల్లో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇది.. ఈ కార్యక్రమానికే హైలెట్‌గా నిలిచింది.
పల్లె పండుగ కార్యక్రమం సందర్భంగా గత ప్రభుత్వంలో రోడ్లు, గ్రామాల దుస్థితి గుర్తు చేస్తూ, కూటమి ప్రభుత్వం వచ్చాక చేసిన అభివృద్ధిని వివరిస్తూ వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి, రామా నాయుడు, రామనారాయణరెడ్డి, ఫరూక్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, నేతలు తొలుత మొక్కలు నాటారు. కాగా.. ఈకార్యక్రమం ద్వారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ జోడీకి ప్రజల్లో ఉన్న ఆదరణ మరోసారి స్పష్టమైందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
This post was last modified on September 30, 2026 9:35 am
సైబర్ నేరాల గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు సహా రిజర్వ్ బ్యాంకు…
చాలా ఏళ్ల నుంచి తమిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒకడు. సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్ తర్వాత…
తెలంగాణలో కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల…
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…
ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…
కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…