తెలంగాణాలో కొండా సురేఖ నుమంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం, తదుపరి పరిణామాల గురించి హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అత్యధికులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తుండగా కొద్ది మంది మాత్రం కొండా సురేఖ వాదనలను బలపరుస్తున్నారు. అయితే కొందరు మేధావులు, రాజకీయ విశ్లేషకులు మాత్రం తెలంగాణా ఏర్పడిన తర్వాత రాజకీయ, సామాజిక, ఆర్ధిక పరిస్థితులను మననం చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు ముగ్గురు మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించినట్లు చర్చ జరుగుతోంది.
ఫస్ట్ వికెట్ రాజయ్య…
కెసిఆర్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా వ్యవహారిస్తున్న వైద్యారోగ్య శాఖ మంత్రి టి. రాజయ్య ను 2015 లో మంత్రివర్గం నుంచి తొలిగించడం పెద్ద సంచలనం సృష్టించింది. అప్పటి వరకు కెసిఆర్ కోటరీలో కీలకపాత్ర పోషించిన రాజయ్య మీద వేటు వేయడం, ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం చరిత్ర సాక్షిగా జరిగింది. స్వైన్ ఫ్లూ నివారణ చర్యల్లో అలసత్వం, వైద్య పరికరాల కొనుగోలులో అవకతవకలను కారణాలుగా పైకి చెప్పినప్పటికి వ్యక్తిగత విభేదాల వల్లనే రాజయ్యను తొలిగించారన్నది సుస్పష్టం.
సెకండ్ వికెట్ ఈటెల…
రాజయ్య మీద వేటు వేసిన తర్వాత సరిగ్గా ఆరేళ్లకు మరో మంత్రి ఈటెల రాజేందర్ పై వేటు వేశారు. రాజేందర్ కూడా వైద్యారోగ్య శాఖ మంత్రి కావడం కాకతాళీయమని చెప్పొచ్చు. ఇక్కడ కూడా అవినీతి కారణాలే చెప్పారు. మెదక్ జిల్లా అచ్చంపేట్, హకిమ్ పేట్ గ్రామాల్లో రైతులకు చెందిన భూములను రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హెచరీస్ ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు కూడా ఆదేశించారు. అయితే ఈటెల తొలగింపు పై తీవ్రమైన చర్చ జరిగింది. విపరీతంగా వాదనలు జరిగాయి. ఆ తర్వాత రాజేందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో తెలంగాణా ఉద్యమకారుల నుంచి వ్యతిరేకత వచ్చింది. తర్వాత సద్దుమణిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఏకంగా టీఆర్ఎస్ టీం మొత్తం ఓటమి పాలైంది.
మూడో వికెట్ కొండా….
రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వేయి రోజులైంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎవరో ఒకరు ఇబ్బందులు పెడుతూనే వున్నారు. ఇటీవల ఈ సమస్య ఎక్కువైంది. మంత్రులకు బదులుగా వారి కుటుంబ సభ్యులు కూడా గీత దాటి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత ఉదంతం దీనికి ఉదాహరణ. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కలిగిన కొండా సురేఖ ఆ మధ్య సినిమా నటుల వ్యవహారంలో తలదూర్చి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు ఆమె కూతురు సుస్మిత విమర్శలతో పదవి పోగొట్టుకున్నారు. పార్టీలో ఆమెకు ప్రత్యర్థులు చాలా మందే వున్నారు. వారి వ్యవహారం శైలి కూడా బాగాలేదన్న విమర్శలున్నాయి. కానీ అధిష్టానాన్ని మెప్పించడంలో సురేఖ వెనకబడ్డారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా ఎన్నో ఉదాత్తమైన ఆశయాలతో తెలంగాణాను తెచ్చుకున్న ప్రజల మనోభావాలకు తగినట్లు పాలకులు వ్యవహరిస్తున్నారా లేదా అనేది కాలమే తేల్చాలి.
This post was last modified on September 5, 2026 6:27 am
మనం ప్యారడైజ్ మేనియాలో పడిపోయాం కానీ తమిళంలో రేపు డోరోతి విడుదల కానుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో పేట…
ఇతర ప్రొడక్షన్ హౌసెస్ దూకుడు తగ్గించి ఉండొచ్చేమో కానీ సితార ఎంటర్ టైన్మెంట్స్ మటుకు నెలకు కనీసం ఒక సినిమా…
డిసెంబర్ 3 నుంచి తప్పుకున్నాక ఫౌజీ ఎప్పుడు విడుదలవుతుందనే దాని మీద సందిగ్దత వీడలేదు. టీమ్ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇటీవలే…
దానం నాగేందర్.. దూకుడు మొత్తానికే ముసలం తెచ్చింది. ఆ.. ఏం చేసినా.. ఏం జరుగుతుందిలే.. అని లైట్ తీసుకుని వేసిన…
పర భాషా నటులకు మన ఫిలిం మేకర్స్ ఇచ్చే ప్రాధాన్యం ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా తెలుగు…
అయిదేళ్ల ముందు టాలీవుడ్ యువ కథానాయకుడు, మెగా ఫ్యామిలీ కుర్రాడు సాయిధరమ్ తేజ్ ఎంత పెద్ద ప్రమాదానికి గురయ్యాడో గుర్తుండే…