నన్ను బెదిరించి లొంగదీసుకోవాలనుకుంటే కుదరదు, స్నేహంతో మాత్రమే నన్ను గెలవగలరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బెదిరింపులతో తననెవరూ భయపెట్టలేరని వ్యాఖ్యనించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన సీఎం చంచల్ గూడ నుంచి ఐఎస్ సదన్ చౌరస్తా వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్బంగా చంచల్ గూడ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత హైదరాబాద్ వచ్చిన సందర్బంగా ఆయన ఇలా మాట్లాడ్డం చర్చకు దారితీసింది. ఎప్పుడూ ఉల్లాసంగా కనిపించే ముఖ్యమంత్రి సభలో కాస్త డల్ గా కనిపించారు.
అదే విషయాన్ని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన ప్రసంగంలో ప్రస్థావించారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు పులిలా గర్జించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సభలో ఎందుకో ముభావంగా కనిపిస్తున్నారని కామెంట్ చేశారు. దీనికి సీఎం తన ప్రసంగంలో రిప్లై ఇచ్చారు. తన మీద ఎవరి ఒత్తిడి లేదన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని వున్నాను కనుక దాని లిమిట్స్ అర్ధం చేసుకొని పనిచేసుకొని పోతున్నానంటూ చెప్పారు.
నేను మలక్ పేట అల్లుడిని, మూసారాంబాగ్ శాలివాహన నగర్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నానంటూ గుర్తు చేశారు. అత్తారిల్లైన మలక్ పేటకు వచ్చి బిర్యానీ తినకుండా వెళుతున్నాను. చెప్పిన పనులన్నీ పూర్తిచేసి ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు బిర్యానీ తిని వెళతానంటూ చేసిన కామెంట్స్ కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. వచ్చే ఎన్నికలలోపు పాతబస్తీలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తానంటూ హామీ ఇచ్చారు.
తనకు హైదరాబాద్ లోని పాతబస్తీ అంటే ఎంతో ఇష్టమని, పాతబస్తీ ప్రాంతాల్లోని మార్కెట్ ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. 400 ఏళ్ళ కిందటే నిజాం నావాబులు నగరాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. పాత బస్తీ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే పాత బస్తీ మీదుగా నాగోల్ విమానాశ్రయాన్ని కలిపే మెట్రో కారిడార్ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. దుర్గం చెరువు తీగల వంతెన ధీటుగా మీరాలం చెరువుపై 3కిలోమీటర్ల పొడవైన కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నాం అని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates