Political News

జత్వానీ కేసులో ఐపీఎస్‌లకు భారీ ఊరట… తక్షణమే విధుల్లోకి!

నటి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు విశాల్‌ గున్ని, కాంతి రాణా టాటాలపై ఉన్న సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. వారిని తక్షణమే విధుల్లోకి పునరుద్ధరిస్తూ గురువారం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి.

అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ, అప్పీల్‌ నిబంధనల ప్రకారం గతంలో వీరిద్దరినీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. అనంతరం సస్పెన్షన్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పొడిగించింది. తాజాగా వీరి సస్పెన్షన్‌ సెప్టెంబరు 4 వరకు అమల్లో ఉండగా, దాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సస్పెన్షన్‌ ఎత్తివేతకు సంబంధించి డీజీపీ (హెచ్‌ఓపీఎఫ్‌) సమర్పించిన నివేదికలను ప్రభుత్వం పరిశీలించింది. కాంతి రాణా టాటా ఆగస్టు 24న సమర్పించిన వినతిపత్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం సస్పెన్షన్‌ ఎత్తివేయాలని నిర్ణయించింది.

అయితే జత్వానీ కేసుకు సంబంధించి వీరిపై కొనసాగుతున్న శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు, పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసులపై సస్పెన్షన్‌ ఎత్తివేత ఎలాంటి ప్రభావం చూపదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తర్వుల ప్రతులను ఇద్దరు అధికారులకు అందజేసి, వారి నుంచి రసీదు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది.

నటి జత్వానీ అరెస్టు వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో పీఎస్ఆర్‌ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్‌ గున్నిలపై కేసులు నమోదయ్యాయి. అనంతరం ప్రభుత్వం వారిని సస్పెండ్‌ చేసింది. ఇదే కేసులో ఉన్న పీఎస్ఆర్‌ ఆంజనేయులు ఇప్పటికే పదవీ విరమణ చేశారు.

సస్పెన్షన్‌ ఎత్తివేసి విధుల్లోకి పునరుద్ధరించిన నేపథ్యంలో విశాల్‌ గున్ని, కాంతి రాణా టాటాలకు త్వరలోనే పోస్టింగ్‌లు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

This post was last modified on September 3, 2026 8:04 pm

Share

Recent Posts

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

2 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

3 hours ago

వివాదాల డోరతి… మనోళ్లు ఇస్తారా హారతి

తమిళంలో తాజాగా విడుదలైన డోరతి అక్కడ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సమాజంలో ఈ మధ్య కాలంలో బాగా చర్చల్లోకి…

5 hours ago

వివేకా హ‌త్య: 40 కోట్ల రూపాయ‌లు ఎవ‌రివి?!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు వ్య‌వ‌హారంలో 40 కోట్ల రూపాయలు కీల‌కంగా…

5 hours ago

గణపయ్య ముందు ఖాకీలు కాలు కదిపితే…

వినాయక చవితిని అత్యంత ఘనంగా జరిపే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి. చవితి వచ్చిందంటే పది రోజుల…

6 hours ago