Political News

సోషల్ మీడియాలో చెప్పి మరీ సినిమాకు వెళ్తున్న కేటీఆర్

రాజకీయ నాయకుల్లో చాలా మందికి సినిమాల మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఆ ఆసక్తి ఉన్న వాళ్లకు కూడా సినిమాలు చూసేంత సమయం ఉండదు. ఒకవేళ సినిమా చూసినా.. ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పడం తక్కువే. ఐతే తెలంగాణ అగ్ర రాజకీయ నాయకుల్లో ఒకరైన కేటీఆర్.. తాను ఒక సినిమా చూడబోతున్నట్లు ముందే ట్వీట్ పెట్టడం విశేషం. ఆయన చూడబోతున్నది.. నేచురల్ స్టార్ నాని మూవీ ‘ది ప్యారడైజ్’ కావడం విశేషం.

ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలు, టాకే వచ్చాయి. ఐతే టాక్ ఎలా ఉన్నప్పటికీ.. ఈ సినిమాకు వసూళ్లు బాగున్నాయి. సోషల్ మీడియాలో దీని మీద పెద్ద చర్చే జరుగుతోంది. దీని మీద ‘తెలంగాణ సినిమా’ అనే ఒక ముద్ర పడింది. తెలంగాణ సినిమా కాబట్టే దీన్ని ఆంధ్రా వాళ్లు తొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఈ ప్రాంతం వాళ్లు ఆరోపిస్తుంటే.. బాలేని సినిమాకు ప్రాంతాన్ని అంటగట్టడం ఏంటి అంటూ ఆంధ్ర వాళ్లు ప్రశ్నిస్తున్నారు.

ఈ గొడవ రోజు రోజుకూ ముదురుతున్న సమయంలో కేటీఆర్ ‘ది ప్యారడైజ్’ సినిమా చూడబోతున్నట్లు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ ఈ సినిమా చూడాలనుకోవడానికి ఇంకో ముఖ్య కారణం ఉంది. ఈ మూవీలో కేటీఆర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కూడా ఉంది. ఆ పాత్రకు సినిమాలో పెట్టిన పేరు.. శంకరన్న. పేరు మారింది కానీ.. అది కేసీఆర్ క్యారెక్టర్ అని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియదర్శి చేసిన ఈ పాత్రకు మేకప్ అంతా కేసీఆర్ లాగే వేశారు. కేసీఆర్ ట్రేడ్ మార్కు డైలాగులు కూడా పెట్టారు.

బాగా నెగెటివిటీ తెచ్చుకున్న ‘ది ప్యారడైజ్’ సెకండాఫ్‌లో మంచి హై ఇచ్చే సన్నివేశాల్లో ఇదొకటి. ఆంధ్ర, తెలంగాణ అని తేడా లేకుండా ఈ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చినపుడు థియేటర్లు హోరెత్తిపోతున్నాయి. తన తండ్రి పాత్రకు మంచి ఎలివేషన్ పడ్డ నేపథ్యంలో కేటీఆర్ సినిమా చూడాలనుకున్నట్లున్నారు. ఐతే ఓవరాల్‌గా సినిమాకు నెగెటివ్ టాక్ ఉన్న నేపథ్యంలో ‘ది ప్యారడైజ్’ చూశాక కేటీఆర్ దీనికి ఏం రివ్యూ ఇస్తారన్నది ఆసక్తికరం.

This post was last modified on September 26, 2026 3:46 pm

Share

Recent Posts

వైసీపీకి మైనస్… జనసేనకు ప్లస్

జ‌గ‌న్ పార్టీలో పెద్ద నేత‌ల ప‌లాయ‌నానికి రంగం రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు రెడ్డి నాయ‌కులు పార్టీని వీడారు.…

12 minutes ago

భాగ్య‌న‌గ‌రంలో ఒంట‌రి జీవులు.. !

దేశ‌వ్యాప్తంగా ఒంట‌రి జీవులు పెరుగుతున్నారా? అంటే.. తాజాగా అసోచామ్ స‌హా మ‌రో రెండు సంస్థలు చేసిన స‌ర్వే ఔన‌నే స‌మాధానమే…

57 minutes ago

మళ్లీ మొదలుబెట్టిన వైసీపీ నానీలు

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నాని చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో…

1 hour ago

హీరో భార్యకు నచ్చలేదని హీరోయిన్ని తీసేశారట…

ఒక సినిమాకు ఒక యాక్టర్‌ను ఎంపిక చేశాక.. మళ్లీ మార్పులు జరగడం సినీ పరిశ్రమలో మామూలే. కాల్ షీట్లు సర్దుబాటు…

2 hours ago

కాకా ఇంత పట్టుదలగా ఎందుకు ఉన్నాడు

చిరంజీవి కాకా స్పీడ్ మాములుగా లేదు. నిన్న జరిగిన సిగ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ స్వయంగా కొన్ని…

3 hours ago

చిరుతో మేన‌ల్లుడి పోటీ ప‌క్కా అట‌

ఒక‌ప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండేవాడు మెగా కుర్రాడు సాయిధ‌ర‌మ్ తేజ్. కానీ రోడ్డు ప్ర‌మాదం త‌ర్వాత త‌న కెరీర్…

5 hours ago