Political News

వివేకా హ‌త్య: 40 కోట్ల రూపాయ‌లు ఎవ‌రివి?!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు వ్య‌వ‌హారంలో 40 కోట్ల రూపాయలు కీల‌కంగా మారాయి. వివేకాను హ‌త్య చేసిన ముఠాకు 40 కోట్ల రూపాయ‌లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింద‌ని.. ఈ క్ర‌మంలో అడ్వాన్సుగా త‌మ‌కు కోటి రూపాయ‌లు ఇచ్చార‌ని ఈ కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి వెల్ల‌డించిన నేప‌థ్యంలో ఆ వ్య‌వ‌హారంపై ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్(ఈడీ) అధికారులు దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో ప‌లువురు కీల‌క వ్య‌క్తులను విచారిస్తున్నారు.

ఇప్ప‌టికే క‌డ‌ప ఎంపీ, వైసీపీ నేత అవినాష్‌రెడ్డి ఇంట్లో, ఆఫీసులోనూ త‌నిఖీలు చేశారు. అలానే ద‌స్త‌గిరి ని కూడా విచారించారు. ఇక‌, మ‌రో నిందితుడు సునీల్ యాద‌వ్‌ను కూడా గురువారం విచారించిన ఈడీ అధికారులు 40 కోట్ల వ్య‌వ‌హారాన్ని తేల్చే ప‌నిలో ప‌డ్డారు. కానీ.. ఇప్ప‌టి వ‌రకు ప‌క్కాగా ఆధారాలు సేక‌రించ‌లేక పోయార‌ని తెలిసింది. దీంతో మ‌రింత‌లోతుగా విచారించేందుకు కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న వివేకా స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డిని కూడా విచారించేందుకు సిద్ధ‌మ‌య్యారు.

అలానే ఏ3గా ఉన్న ఉమాశంక‌ర్‌రెడ్డిని కూడా విచారించ‌నున్నారు. ఈ మేర‌కు వారికి నోటీసులు ఇచ్చారు. ఆదివా రం, సోమ‌వారం వీరిని విచారించ‌నున్నారు. 40 కోట్ల రూపాయ‌ల సుపారీ వ్య‌వ‌హారం తేలితే.. కేసు దాదాపు కొలిక్కి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అలానే.. అస‌లు కీల‌క కార‌ణం కూడా తెలుస్తుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. వివేకాను హ‌త్య చేయ‌డం ద్వారా ఎవరికి లాభం.. ఎవ‌రు ల‌బ్ధి పొందుతారు? అనే విష‌యాల‌ను కూడా అధికారులు తేల్చ‌నున్నారు. ఈ నేప‌థ్యంలోనే 40 కోట్ల రూపాయ‌ల చుట్టూ ఇప్పుడు విచార‌ణ జోరుగా సాగుతోంది.

సీబీఐ విచార‌ణ ముగిసిన‌ట్టే!

2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన వివేకా దారుణ హ‌త్య‌కు సంబంధించి సీబీఐ విచార‌ణ ముగిసిన‌ట్టేన‌ని తెలుస్తోంది. దీనిపై మ‌ళ్లీ విచార‌ణ చేయాల‌ని.. త‌న‌కు అనేక అనుమానాలు ఉన్నాయ‌ని.. ముఖ్యంగా జ‌గ‌న్ కు ఆ మ‌ర‌ణ వార్త ఎలా చేరింది? ఎందుకు చేరింద‌న్న విష‌యాలు తెలియాల్సి ఉంద‌ని వివేకా కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. అయితే.. ఇప్ప‌టికే అనేక కోణాల్లో విచార‌ణ చేశామ‌ని.. చెబుతూ.. సీబీఐ దీనిని ముగించింది. అయితే.. కోర్టులో ట్ర‌య‌ల్ ఇంకా ప్రారంభం కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇది ప్రారంభ‌మ‌య్యాక‌.. అస‌లు దోషులు ఎవ‌ర‌నేది తేల‌నుంది.

This post was last modified on September 26, 2026 1:14 pm

Share

Recent Posts

గణపయ్య ముందు ఖాకీలు కాలు కదిపితే…

వినాయక చవితిని అత్యంత ఘనంగా జరిపే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి. చవితి వచ్చిందంటే పది రోజుల…

60 minutes ago

సోషల్ మీడియాలో చెప్పి మరీ సినిమాకు వెళ్తున్న కేటీఆర్

రాజకీయ నాయకుల్లో చాలా మందికి సినిమాల మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఆ ఆసక్తి ఉన్న వాళ్లకు కూడా సినిమాలు…

2 hours ago

వైసీపీకి మైనస్… జనసేనకు ప్లస్

జ‌గ‌న్ పార్టీలో పెద్ద నేత‌ల ప‌లాయ‌నానికి రంగం రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు రెడ్డి నాయ‌కులు పార్టీని వీడారు.…

2 hours ago

భాగ్య‌న‌గ‌రంలో ఒంట‌రి జీవులు.. !

దేశ‌వ్యాప్తంగా ఒంట‌రి జీవులు పెరుగుతున్నారా? అంటే.. తాజాగా అసోచామ్ స‌హా మ‌రో రెండు సంస్థలు చేసిన స‌ర్వే ఔన‌నే స‌మాధానమే…

2 hours ago

మళ్లీ మొదలుబెట్టిన వైసీపీ నానీలు

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నాని చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో…

2 hours ago

హీరో భార్యకు నచ్చలేదని హీరోయిన్ని తీసేశారట…

ఒక సినిమాకు ఒక యాక్టర్‌ను ఎంపిక చేశాక.. మళ్లీ మార్పులు జరగడం సినీ పరిశ్రమలో మామూలే. కాల్ షీట్లు సర్దుబాటు…

4 hours ago