నటుడు శివాజీ డిమాండ్ ఈ మధ్య బాగా పెరిగిపోయింది. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ నుంచి మొన్న లెనిన్ దాకా చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలను దక్కించుకుంటున్నారు. సీనియర్ గా సెకండ్ ఇన్నింగ్స్ ని బాగా నిర్మించుకుంటున్నారు. రాజేంద్రప్రసాద్, నరేష్ లాంటి వాళ్లకు ఆల్టర్నేటివ్ గా మారుతున్నారు. త్వరలో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ లో ఆనంద్ దేవరకొండ తండ్రిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మిడిల్ క్లాస్ కొనసాగింపుగా దర్శకుడు ఆదిత్య హాసన్ దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలలో శివాజీ మాట్లాడుతూ బద్దకస్తులు మాత్రమే ఓటిటి చూస్తారని, నిజమైన కంటెంట్ ని ఎంజాయ్ చేయాలంటే థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని మించింది లేదని బల్లగుద్ది చెప్పారు. దీన్ని పూర్తిగా ఒప్పుకోలేకపోయినా కొంత వరకు నిజమని చెప్పాలి. అయితే 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ కనక థియేటర్లకు వచ్చి ఉంటే 100 కోట్లు వసూలు చేసేదని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు శివాజీ. తీసినోళ్లు భయపడ్డారు కాబట్టి మంచి ఛాన్స్ మిస్సయ్యిందనే కోణంలో మాట్లాడారు.
వినడానికి బాగానే ఉంది కానీ వంద కోట్లు అంటే చాలా ఈజీ మ్యాటర్ అయినట్టుంది. నిజంగా 90స్ మిడిల్ క్లాస్ థియేటర్లకు వచ్చి ఉంటే వంద కోట్లు వసూలు చేసేదనేది మాత్రం నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఒక ఎంటర్ టైనర్ మహా అయితే యాభై నుంచి డెబ్భై కోట్ల దాకా లాగుతుంది. లిటిల్ హార్ట్స్ ఎంత మెప్పించినా హాఫ్ సెంచరీని టచ్ చేయలేకపోయింది. దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన బలగం కూడా అంతే.
అలాంటప్ప్పుడు 90స్ మిడిల్ క్లాస్ ఏదో అద్భుతం చేసెదనుకుంటే అంత ఈజీగా కన్విన్స్ కాలేం. ఇక బద్దకస్తుల పాయింట్ కు వస్తే ఓటిటికి సెపరేట్ ఆడియన్స్ ఉంటారు. థియేటర్లో ఫ్రీగా సినిమాలు వేసినా వీళ్ళు ఇంట్లోనే చూస్తామంటారు. కొన్ని సినిమాలు నిజంగా బుల్లితెర మీద చూడటమే గొప్పనేలా ఉంటాయి. వాటిని పెద్ద తెరమీదకు తీసుకొచ్చి లాభం లేదు. అలాంటప్పుడు వాళ్లకు గంపగుత్తగా లేజీ ఫెలోస్ అనే సర్టిఫికేట్ ఇవ్వడం రైట్ కాదని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on September 3, 2026 9:57 pm
నటి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలపై ఉన్న సస్పెన్షన్‌ను…
రష్మిక మందన్నాది ప్రస్తుతం ఇండియాలో దాదాపుగా నంబర్ వన్ హీరోయిన్ స్థానం. తాజాగా ఇండియా టుడే కూడా ఆ విషయాన్ని…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన యాభై సినిమాకు చేరువవుతున్నాడు. ప్రస్తుతం పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న మూవీ షూటింగ్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్, అత్యధిక వర్కింగ్ డేస్‌లో రూపొందుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. దీనికి క్రేజ్…
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. కానీ తర్వాత నాలుగు నెలల పాటు బాక్సాఫీస్‌లో హాహాకారాలు తప్పలేదు. నిఖార్సయిన…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' సెప్టెంబర్ 11 విడుదల…