Movie News

వివాదాల డోరతి… మనోళ్లు ఇస్తారా హారతి

తమిళంలో తాజాగా విడుదలైన డోరతి అక్కడ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సమాజంలో ఈ మధ్య కాలంలో బాగా చర్చల్లోకి వచ్చిన LGBTQ కాన్సెప్ట్ ని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తీసుకోవడంతో దీని మీద రకరకాల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్వలింగ ఆకర్షణ, లెస్బియన్ తదితర పోకడలను ప్రోత్సహించేలా డోరతి ఉందంటూ పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించాయి. ఇప్పుడీ డోరతి తెలుగులో అక్టోబర్ 2 రిలీజ్ కు రెడీ అవుతోంది.

కీర్తి సురేష్ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించడం డబ్బింగ్ వరకు ఇక్కడ కాస్త వర్కౌట్ అయ్యేలానే ఉంది. కాకపోతే కథలోని సున్నితమైన విషయాలు మన ఆడియన్స్ ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. ఎందుకంటే మలయాళంలో మమ్ముట్టి లాంటి స్టార్లు ఇలాంటి కథల్లో నటించినా వర్కౌట్ అయ్యింది. హిందీలో వెబ్ సిరీస్ లు బోలెడు వచ్చాయి. కానీ టాలీవుడ్ జనాల అభిరుచులు, పద్ధతులు వాటికి ఇంకా అలవాటు పడకపోవడం వల్ల రచయితలు ఈ బ్యాక్ డ్రాప్ ఎంచుకోరు.

ప్రాధమికంగా రివ్యూలు పబ్లిక్ టాక్ చూస్తే ఇలాంటి సబ్జెక్టులని ఓపెన్ మైండ్ తో చూస్తే తప్ప ఏ మాత్రం రుచించదని క్రిటిక్స్ వర్గం అంటుండగా, బయట ప్రచారం జరిగినంత దారుణంగా కార్తీక్ సుబ్బరాజ్ ప్రెజెంటేషన్ లేదని, కాకపోతే క్లైమాక్స్ లో చూపించిన ట్విస్టు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా అనిపించకపోవచ్చని, అదొక్కటి మినహాయిస్తే లోపాలు తక్కువని మరో వర్గం అంటోంది. ఇళయరాజా సంగీతం కన్నా ఈ పాయింట్ల మీధ్ద డిస్కషన్ ఎక్కువగా ఉంది.

ఎలాగూ ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటంతో ఫస్ట్ వీక్ లో పెద్దగా కాంపిటీషన్ లేదు. ఆ అడ్వాంటేజ్ ని డోరతి ఏ మేరకు వాడుకుంటుందో చూడాలి. హీరోలు ఇద్దరు మనకు పరిచయం లేని వాళ్ళే. కాంట్రవర్సి, కీర్తి సురేష్, ఇళయరాజా పేర్లు చూసి రావాలి తప్పించి ప్రత్యేకంగా మిగిలిన అంశాలు ఓపెనింగ్ తేవడం అనుమానమే. టాక్ వస్తే నిలబడుతుంది. రెండో వారంలో ప్యారడైజ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనే దాని మీద కూడా డోరతి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

This post was last modified on September 26, 2026 5:44 pm

Share

Recent Posts

వివేకా హ‌త్య: 40 కోట్ల రూపాయ‌లు ఎవ‌రివి?!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు వ్య‌వ‌హారంలో 40 కోట్ల రూపాయలు కీల‌కంగా…

53 minutes ago

గణపయ్య ముందు ఖాకీలు కాలు కదిపితే…

వినాయక చవితిని అత్యంత ఘనంగా జరిపే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి. చవితి వచ్చిందంటే పది రోజుల…

2 hours ago

సోషల్ మీడియాలో చెప్పి మరీ సినిమాకు వెళ్తున్న కేటీఆర్

రాజకీయ నాయకుల్లో చాలా మందికి సినిమాల మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఆ ఆసక్తి ఉన్న వాళ్లకు కూడా సినిమాలు…

2 hours ago

వైసీపీకి మైనస్… జనసేనకు ప్లస్

జ‌గ‌న్ పార్టీలో పెద్ద నేత‌ల ప‌లాయ‌నానికి రంగం రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు రెడ్డి నాయ‌కులు పార్టీని వీడారు.…

2 hours ago

భాగ్య‌న‌గ‌రంలో ఒంట‌రి జీవులు.. !

దేశ‌వ్యాప్తంగా ఒంట‌రి జీవులు పెరుగుతున్నారా? అంటే.. తాజాగా అసోచామ్ స‌హా మ‌రో రెండు సంస్థలు చేసిన స‌ర్వే ఔన‌నే స‌మాధానమే…

3 hours ago

మళ్లీ మొదలుబెట్టిన వైసీపీ నానీలు

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నాని చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో…

3 hours ago