కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది. ఈ పుస్తకాన్ని ముద్రించేందుకు ఒప్పందం చేసుకున్న విదేశీ ప్రచురణ కర్త.. పెంగ్విన్.. ఈ ఒప్పందం నుంచి తప్పుకొంది. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. అసలు ఎందుకు ఈ సంస్థ ముద్రణ ఒప్పందం నుంచి తప్పుకుందన్నది కూడా ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో సదరు సంస్థ వివరణ ఇచ్చింది. తాము తప్పుకొన్న మాట వాస్తవమేనని పేర్కొంది.
సోనియా గాంధీ.. ఇటలీ దేశస్తురాలు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పెద్దకుమారుడు, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని ఆమె ప్రేమించి వివాహం చేసుకున్నారు. అనంతరం.. భారత దేశానికి తిరిగి వచ్చారు. సుదీర్ఘకాలం పాటు ఆమె కుటుంబానికే పరిమితం అయ్యారు. రాజీవ్‌గాంధీ మరణానంతరం కూడా.. సుమారు 8 ఏళ్లకు పైగా పార్టీ విషయాలపై దృష్టి పెట్టలేదు. అప్పట్లో సీతారం కేసరి, మాజీ ప్రధానిపీవీ నరసింహారావే విషయాలు చూసుకునేవారు. అయితే.. ఆనాటి నుంచి నేటి వరకు ఉన్న అంశాలను ప్రోది చేసి.. సోనియా పుస్తకం రాశారు.
దీనికి.. ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ అని పేరు పెట్టారు. ఈ పుస్తకాన్ని ప్రచురించేందుకు పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఒప్పందం చేసుకుంది. వాస్తవానికి దీనిని వచ్చే నెలలో మార్కెట్‌లోకి తీసుకురావాల్సి ఉంది. కానీ. హఠాత్తుగా పెంగ్విన్ సంస్థ.. ఈ ప్రచురణ ఒప్పందం నుంచి తప్పుకొంది. దీనిపై తాజాగా ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ముందస్తు ఒప్పందం ప్రకారం.. సోనియా రాసిన పుస్తకాన్ని తాము విదేశాలకు మాత్రమే పరిమితం చేశామని.. భారత దేశంలో తమ ముద్రణ పుస్తకం అందు బాటులోకి రాదని తెలిపింది.
ఇక, ఈ పుస్తకంలోని కొన్ని అంశాల్లో మార్పులు చేర్పులు చేయాలని రచయిత సోనియాకు తాము సూచించినట్టు పెంగ్విన్ పేర్కొంది. మార్పులు, చేర్పులు సూచించడం అనేది ముద్రణ సంస్థకు ఉన్న హక్కు అని.. దీనిని అంగీకరించాలా.. వద్దా.. అనేది రచయిత ఇష్టానికే వదిలేస్తామని పేర్కొంది. ఒక, ప్రచురణకర్తగా వాస్తవాలను సరిచూసుకోవడం. అవసరమైతే రచయితలకు కొన్ని సిఫార్సులు చేయడం కామన్‌గా జరిగే ప్రక్రియ. ఇక్కడ కూడా అదే జరిగింది.అని వివరించింది.
ఇక, సోనియా పుస్తకం ప్రచురణ నుంచి తప్పుకొన్న మాట వాస్తవమేనని అయితే.. దీనిపై ప్రచారంలోకి వస్తున్న కారణాలు మాత్రం సహేతుకంగా లేవని పెంగ్విన్ పేర్కొంది. అలాగే.. తాము ముద్రణకు ముందు రచయితతో జరిగిన రహస్య చర్చల తాలూకు విషయాన్ని బయటకు చెప్పబోమని పేర్కొంది. మొత్తంగా ఈ పుస్తకం ముద్రణ వివాదంలో పడడం.. దీనిపై పెంగ్విన్ వివరణ ఇవ్వడం గమనార్హం. ఇదిలావుంటే.. నవంబరు 10న సోనియా ఆత్మకథ.. ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం అందుబాటులోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రకటించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates