కొండా మురళి, కొండా సురేఖ దంపతులు ఇప్పటివరకు రాజకీయంగా అడుగు పెట్టని ఒకే ఒక్క ప్రధాన పార్టీ బీజేపీ. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న తీవ్రమైన అంతర్గత విభేదాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వారి కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, పార్టీ క్రమశిక్షణా కమిటీ చర్యల హెచ్చరికలతో తమ వద్ద ‘ప్లాన్-బీ’ ఉందనే పరోక్ష సంకేతాలను వారు పంపుతున్నారు.
ఒకవేళ అధిష్టానం కేబినెట్ నుంచి తప్పిస్తే ఆత్మగౌరవం పేరిట బయటకు వచ్చి నిర్ణయం తీసుకోవడానికి కొండా దంపతులు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వారు బీజేపీ అగ్రనేతలతో రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కొండా సురేఖ బీజేపీ ఎంట్రీపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నర్మగర్భంగా స్పందిస్తూ ముందు ఆమె పార్టీకి, పదవికి రాజీనామా చేస్తే అప్పుడు ఆలోచిస్తామన్నట్టుగా మాట్లాడారు.
బీజేపీ కోణం నుంచి చూస్తే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన మున్నూరు కాపు, పద్మశాలి సామాజిక వర్గాలకు చెందిన బీసీ నాయకత్వం కోసం ఆ పార్టీ సుదీర్ఘకాలంగా వెతుకుతోంది. మాస్ ఫాలోయింగ్ ఉన్న ఫైర్‌బ్రాండ్ బీసీ మహిళా ముఖంగా కొండా సురేఖను చేర్చుకోవడం వల్ల ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించవచ్చని కమలనాథులు లెక్కిస్తున్నారు. వీరి ఆర్థిక బలం, క్యాడర్ బలం కూడా పార్టీకి కలిసివచ్చే అంశమే. కొండా సురేఖ దంపతులు బీజేపీలో చేరితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి మంచి ఊపే వస్తుంది.
అయితే, కొండా మార్కు రాజకీయాలను బీజేపీ అధిష్టానం భరించగలదా అనే సందేహం సహజంగానే వ్యక్తమవుతోంది. కమలం పార్టీలోని కఠినమైన క్రమశిక్షణ, ఆర్ఎస్ఎస్ భావజాలం, ఢిల్లీ అధిష్టానం చెప్పినట్లు నడిచే కేంద్రీకృత వ్యవస్థలో కొండా దంపతులు ఇమడటం దాదాపు అసాధ్యమనే అభిప్రాయం ఉంది. కొండా మురళి, సురేఖల నైజం ఎప్పుడూ వ్యక్తిగత నాయకత్వం చుట్టూనే తిరుగుతుంది తప్ప ఒక పార్టీ విధానాలకు లోబడి పనిచేసే తత్వం కాదు. ప్రశ్నించే వెసులుబాటు ఉన్న కాంగ్రెస్‌లోనే ఇమడలేక సొంత ప్రభుత్వంపైనే బహిరంగ విమర్శలు చేసిన వీరు బీజేపీలో ఎక్కువ రోజులు ఉండలేరనేది బహిరంగ రహస్యం.
గతంలో కాంగ్రెస్ నుంచి వైఎస్సార్‌సీపీకి, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌కు, మళ్లీ తిరిగి కాంగ్రెస్‌కు మారిన చరిత్ర వీరిది. ఒకవేళ వీరు వ్యూహాత్మకంగా బీజేపీలో చేరినా, అది తాత్కాలిక రాజకీయ ఆశ్రయం మాత్రమే అవుతుంది. సిద్ధాంతాల కంటే తమ ఆధిపత్యానికే ప్రాధాన్యమిచ్చే కొండా దంపతులకు బీజేపీ ఒక ఆప్షన్ కావచ్చు కానీ, ఆ బంధం సుదీర్ఘ కాలం నిలవడం మాత్రం కష్టమేనని పొలిటికల్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి.
This post was last modified on August 27, 2026 7:30 pm
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…
ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…
నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…