రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన భేటీలో స్థానిక ఎన్నికల నిర్వహణ, కూటమి పార్టీల మధ్య సమన్వయం, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
స్థానిక ఎన్నికల్లో కూటమిలోని ఏ పార్టీ ఏ ప్రాంతంలో పోటీ చేయాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుని స్థానాల పంపకం చేపట్టాలని నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికలోనూ మూడు పార్టీల మధ్య సమన్వయం ఉండేలా కార్యాచరణ రూపొందించడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసికట్టుగా పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపైనా చంద్రబాబు, పవన్ చర్చించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మూడు పార్టీలకు చెందిన నేతలు ఆరేడు దఫాలుగా సమావేశమై కూటమి సమన్వయం, స్థానిక ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. క్షేత్రస్థాయిలోనూ ఆయా పార్టీల నేతల మధ్య సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ విడిగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశం అనంతరం చంద్రబాబుతో కలిసి పవన్ అల్పాహార విందులో పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండటంతో ఆయన అందుబాటులో లేరని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే కూటమి పార్టీల బలాబలాలు, స్థానాల పంపకం, అభ్యర్థుల ఎంపిక, సమన్వయ వ్యవస్థను ఒక కొలిక్కి తీసుకురావడంపై తాజా భేటీలో కీలకంగా చర్చించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
This post was last modified on October 6, 2026 2:00 pm
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…
ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…
నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…
సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…
ఒకప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియన్ ఫిలిం మేకర్స్ ఆలోచించడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత…