Movie News

రియాలిటీకి దగ్గరగా ఉన్నా కామెంట్స్ తప్పలేదు

నిన్న కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక సాంప్రదాయ హోటల్ నడుపుకునే కుర్రాడు, ఇంటి మీద ఉన్న అప్పులన్నీ తీర్చేసి జీవితంలో తనకదే హై మూమెంట్ అని చెప్పుకోవడాన్ని ఇందులో చూపించారు. మన హీరోలు వంటవాడిగా నటించి చాలా ఏళ్లయిన నేపథ్యంలో కిరణ్ ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడం మాస్, మిడిల్ క్లాస్ కు చేరువయ్యేలా ఉంది. ఇక కామెంట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి.

సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరం ముందు నుంచి కొన్ని వర్గాలకు టార్గెట్ అవుతూ వచ్చాడు. వినరో భాగ్యము విష్ణు కథ ఈవెంట్ లో దాని గురించి ఓపెనయ్యాడు కూడా. క సూపర్ హిట్ అయ్యాక కాస్త కుదురుకుని మొన్న చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ తో ఫుల్ జోష్ లోకి వచ్చేశాడు. అయితే తన నటన, బాడీ లాంగ్వేజ్ గురించి ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో మిక్స్డ్ రెస్పాన్స్ వినిపిస్తూ ఉంటుంది. రియాలిటీకి ఇది జరిగింది. టీజర్ చివరిలో కిరణ్ పంచలో వెరైటీగా నడుచుకుంటూ వచ్చే షాట్ ఇక్కడ టార్గెట్ అయ్యింది.

నిజం చెప్పాలంటే టైటిల్ కు తగ్గట్టే దర్శకుడిగా మారిన కిరణ్ అబ్బవరం సరైన సెటప్పే రాసుకున్నాడు. ప్రెజెంటేషన్ నీట్ గా ఉంటే ఇలాంటివి పాస్ అయిపోతాయి. కిరణ్ పని చేసింది కూడా ఆ దిశగానే. ఇందులో ఏ మేరకు సక్సెస్ అవుతాడనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది కానీ అప్పటిదాకా ఇలాంటివి చూసి చూడనట్టు పోవాల్సిందే. ఇప్పటికే సగానికి పైగా షూట్ పూర్తి చేసిన కిరణ్ అబ్బవరం డిసెంబర్ 25 విడుదలకు సర్వ సన్నద్ధంగా ఉన్నాడని టీమ్ మాట.

ఆశ్చర్యంగా బాలకృష్ణ దాదా, నాగార్జున కింగ్ 100తో నేరుగా తలపడాలని కిరణ్ నిర్ణయించుకోవడం అభిమానులకు షాక్ ఇచ్చింది. చాలా టైట్ గా ఉన్న క్రిస్మస్ వీక్ లో పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలు వేరే ఆప్షన్ చూసుకోవడం మంచిది. కానీ కిరణ్ మాత్రం జనవరిలో ఛాన్స్ ఉండదు కాబట్టి ముందే రావాలని డిసైడ్ అవుతున్నాడు. బహుశా ఇద్దరు సీనియర్లలో ఎవరో ఒకరు చెప్పిన టైంకు రాలేరనే ధీమా కూడా ఉండొచ్చు. అందుకే అంత కాన్ఫిడెంట్ గా డిసెంబర్ 25 వేసుకుని ఉండొచ్చు.

This post was last modified on October 6, 2026 12:23 pm

Share

Recent Posts

త్రివిక్రమ్ బాధ్యత గురించి భేతాళ ప్రశ్న

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…

2 minutes ago

సరైన పుకారు ఎవరు సృష్టించారు

సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…

36 minutes ago

రాకాతో ఆస్కార్ కొట్టి త‌మిళంలో మాట్లాడ‌తా

ఒక‌ప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియ‌న్ ఫిలిం మేక‌ర్స్ ఆలోచించ‌డం కూడా క‌ష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత…

3 hours ago

టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…

4 hours ago

మంట‌లు రేపుతున్న `ఫాం-6..`

కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని అనుకునేవారు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…

4 hours ago

అఖండ-3 నిజంగా సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…

9 hours ago