Movie News

ఇరుముడిని కొనియాడుతూ మెగాస్టార్ వార్నింగ్?

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.. తెలుగు సినీ పరిశ్రమకు అనధికార పెద్ద చిరంజీవి అనడంలో సందేహం లేదు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా తన వంతుగా ఇండస్ట్రీలో ఏ సినిమాకు తన అవసరం ఉన్నా తోడ్పాటు అందిస్తుంటారు చిరు. అలాగే ఇండస్ట్రీలో ఒక పెద్ద హిట్ పడితే.. అభినందిస్తూ వీడియోలు రిలీజ్ చేయడం లేదా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చేస్తుంటారాయన. తాజాగా ఇరుముడి సినిమా ఆయన దృష్టిని ఆకర్షించింది.

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని స్థాయిలో విజయం అందుకుంది. నాలుగు రోజుల్లోనే రూ..100 కోట్ల మార్కును అందుకున్న ఆ చిత్రం.. ఇప్పుడు రూ.200 కోట్ల మైలురాయి వైపు అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా ‘ఇరుముడి’ టీంను కొనియాడుతూ చిరు ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. ఐతే కేవలం అభినందనలతో సరిపెట్టకుండా చివర్లో చిరు చేసిన ఒక కామెంట్ చర్చనీయాంశంగా మారింది.

తన ప్రియమైన తమ్ముడు ‘ఇరుముడి’తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉందంటూ శుభాకాంక్షలు చెప్పిన చిరు.. త్రినాథ్ పాత్రని తన భుజ స్కందాలపై పెట్టుకుని ఒక అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చాడంటూ రవితేజను కొనియాడాడు. మొదటి నుంచి చివరి వరకు సినిమాను ఎంతో ఎంజాయ్ చేసినట్లు చెప్పిన చిరు.. దర్శకుడు శివ నిర్వాణ ఇలాంటి డెప్త్ ఉన్న సబ్జెక్టును అద్భుతంగా తీశాడని… బేబీ నక్షత్రకి ఉజ్వల భవిష్యత్తు ఉంది.. మొత్తం సినిమా యూనిట్లో అందరికీ చిరు తన విషెస్ అందించారు.

ఇక చివర్లో.. ‘‘ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి’’ అంటూ చిరు ఒక కామెంట్ జోడించారు. ఇటీవల చిరు మీద ఒక వర్గం నెగెటివ్ ట్రోలింగ్ చేస్తోంది. ఆయన ప్రతిభావంతులను తొక్కేస్తాడంటూ నెగెటివ్ ట్రెండ్ చేస్తున్నారు. ఐతే తాను అందరివాడినని.. ఇండస్ట్రీ ఎవరికీ సొంతం కాదని.. మనం బతకాలి, ఇతరులనూ బతికించాలన్నది తన పాలసీ అని చిరు తన హేటర్స్‌కు వార్నింగ్ లాగా ఈ కామెంట్ చేశారని భావిస్తున్నారు. మరో వైపు ఇరుముడికి స్క్రీనులు తగ్గే విధంగా టాక్సిక్ ను రిలీజ్ చేసిన దిల్ రాజు గురించే అలా పోస్ట్ వేసినట్టు కొందరు అభిమానులు కామెంటు చేస్తున్నారు.

This post was last modified on August 27, 2026 7:22 pm

Share

Recent Posts

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

53 minutes ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

1 hour ago

జనాలు పట్టేశాక నిజాలు ఒప్పుకుంటే ఎలా?

ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…

1 hour ago

త్రివిక్రమ్ బాధ్యత గురించి భేతాళ ప్రశ్న

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…

2 hours ago

రియాలిటీకి దగ్గరగా ఉన్నా కామెంట్స్ తప్పలేదు

నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…

2 hours ago

సరైన పుకారు ఎవరు సృష్టించారు

సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…

3 hours ago