వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఆ పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఎంతగా రెచ్చిపోయారో గుర్తుండే ఉంటుంది. ఈ వివాదాస్పద నేత వైసీపీ అధికారం కోల్పోయాక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసుకు తోడు.. అవినీతి వ్యవహారాలకు సంబంధించిన కేసులతో ఆయన పోరాడుతున్న సంగతి తెలిసిందే. వాటిని మించి కుటుంబ వివాదం జోగి రమేష్ ఇమేజ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.
గత ఏడాది తన కొడుకు జోగి రాజీవ్‌కు మేఘన అనే తెలంగాణ అమ్మాయితో పెళ్లి చేయగా.. ఏడాది తిరక్కముందే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. కొన్ని వారాల కిందట మేఘన రాజీవ్‌తో పాటు జోగి కుటుంబం మొత్తం మీద పలు సంచలన ఆరోపణలు చేస్తూ కేసు పెట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన భర్త వివాహానికి పనికి రాడని ఆరోపించడంతో పాటు తనపై అతను, తన అత్త మామలు గృహ హింసకు పాల్పడినట్లు, బలవంతపు మత మార్పిడికి ప్రయత్నించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
మీడియాలో, సోషల్ మీడియాలో ఈ వ్యవహారం కొన్ని వారాలుగా చర్చనీయాంశం అవుతుండగా.. ఇప్పుడీ వ్యవహారం మరింత రచ్చకెక్కింది. రాజీవ్, మేఘన కుటుంబాల మధ్య జరిగిన పంచాయితీకి సంబంధించిన వీడియోలు, ఆడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అందులో ఒక వీడియోలో రాజీవ్.. తన తల్లిదండ్రులను తప్పుబట్టడం గమనార్హం. తాను అయిష్టంగానే మేఘనను పెళ్లి చేసుకున్నట్లు అతను స్పష్టం చేశాడు.
ఆమె ఫొటో చూడగానే తనకు ఏ ఫీలింగ్స్ కలగలేదని.. కానీ తన తల్లిదండ్రులు, మరికొందరు తనను బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేశారని అతనన్నాడు. తండ్రిని వేలెత్తి చూపిస్తూ అంతా మీరే చేశారు అంటూ అతను నిందించడం గమనార్హం. మరో వీడియోలో రాజీవ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. మేఘనను ఉద్దేశించి మాట్లాడుతూ.. నీకోసం పెళ్లి చేసుకోలేదు, మా అమ్మానాన్నల కోసం చేసుకున్నా అనగా.. మేఘన వాళ్ల కోసం నా జీవితాన్ని నాశనం చేశావా అంటూ మండిపడింది.
ఆ సమయంలో కొడుకునే కంట్రోల్ చేయడానికి జోగి రమేష్ ప్రయత్నించి విఫలమయ్యారు. తండ్రితో అప్పుడు కూడా రాజీవ్ చాలా దురుసుగా వ్యవహరించాడు. తనకు ఏసు ప్రభువు వీడియోలు చూపిస్తూ మతం మార్పిడి కోసం ప్రయత్నించినట్లు మేఘన ఆరోపించింది. మరోవైపు మేఘన కుటుంబీకులతో రాజీవ్ తల్లి మాట్లాడిన ఫోకల్ కాల్ ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. తామే 50 లక్షలు ఖర్చు చేసి పెళ్లి చేశామని, కనీసం మీరు ఒక చైన్ కూడా వేయలేదంటూ ఆమె అందులో పేర్కొంది.
This post was last modified on August 18, 2026 9:51 am
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…