Political News

ప‌వ‌న్ ఒక్క ఆలోచ‌న‌… 5 వేల కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అట‌వీశాఖ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న చేసిన ఒకే ఒక్క ఆలోచ‌న.. 5 వేల క‌ళాకార కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు మెరిపించింది. చిన్న‌, సూక్ష్మ‌స్థాయి క‌ళారూపాల‌ను రూపొందించే క‌ళాకారులు తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో ఎక్కువ‌గా ఉన్నారు. వీరు రూపొందించే క‌ళాకృతుల‌కు దేశ‌విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది. అయితే.. వీరు ఉప‌యోగించే `క‌ల‌ప‌` ల‌భించ‌క‌పోవ‌డం.. భారీ ధ‌ర‌లు ప‌లుకుతుండ‌డంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స‌మ‌స్య‌పై గ‌త ఏడాది క‌ళాకారులు ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ను క‌లిసి విన్న‌వించారు.

అనంత‌రం.. ఏడాది కాలంలోనే వారి కోరిక నెర‌వేరుస్తూ.. ఏకంగా క్రాఫ్ట్ ఉడ్ బ్యాంక్‌(క‌ళాకారులు వినియోగించే క‌ల‌ప నిల్వ కేంద్రం)కు ప‌వ‌న్ క‌ల్యాణ్ శ్రీకారం చుట్టారు. తాజాగా శ‌నివారం త‌న స‌తీమ‌ణి అన్నా కొణిదెల‌తో క‌లిసి తూర్పుగోదావ‌రి జిల్లాలోని ధ‌వ‌ళేశ్వ‌రంలో ఈ బ్యాంకును ప్రారంభించారు. హ‌స్త క‌ళ‌ల‌(హ్యాండీ క్రాఫ్ట్‌) ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలోనే ప్ర‌ద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా క‌ళాకారుల‌కు అవ‌స‌ర‌మైన క్రాఫ్ట్ ఉడ్‌ను కూడా అందుబాటులో ఉంచుతారు. ప్ర‌స్తుతం 30 క్యూబిక్ మీట‌ర్ల మేర‌కు క‌ల‌ప‌ను అందుబాటులో ఉంచారు.

రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల‌కు పైగా కుటుంబాలు.. క్రాఫ్ట్ ఉడ్ క‌ళ‌పైనే ఆధార‌ప‌డి జీవిస్తున్నాయి. పిల్ల‌లు ఆడుకునే బొమ్మ‌ల నుంచి కానుక‌లు, బ‌హుమ‌తులుగా ఇచ్చుకునే పెద్ద సైజు బొమ్మ‌ల వ‌ర‌కు వీరు రూపొందిస్తారు. అయితే.. వీటికి వినియోగించే క‌ల‌ప భిన్నంగా ఉంటుంది. ఇది అట‌వీ ప్రాంతాల్లో అరుదుగా ల‌భిస్తోంది. దీంతో వీటి ధ‌ర‌లు భారీగా ఉండ‌డంతోపాటు.. ఎగుమ‌తి అయిపోతోంది. ఈ స‌మ‌స్య‌పై దృష్టి పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఉడ్ బ్యాంకు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దీంతో తొలిసారి ఈ బ్యాంకు ఏర్పాటు కావ‌డం గ‌మ‌నార్హం. ఇక నుంచి ఈ బ్యాంకు ద్వారా త‌క్కువ ధ‌ర‌ల‌కే క‌ళాకారుల‌కు ఉడ్ ల‌భిస్తుంది. రాయితీలు ఇచ్చేందుకు కూడా ప్ర‌భుత్వం త‌ర‌ఫున కృషి చేయ‌నున్నారు.

ఆస‌క్తిగా తిల‌కించిన అన్నా..

ధ‌వ‌ళేశ్వ‌రంలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ ఉడ్ బ్యాంక్ కేంద్రాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న స‌తీమ‌ణితో క‌లిసి ప్రారంభించారు. అనంత‌రం.. ఎగ్జిబిష‌న్‌ను కూడా ఇరువురూ తిల‌కించారు. అగ్గిపెట్టెలో ఇమిడి పోయే క‌ళాకృతుల‌ను చూసి ఇరువురు మంత్ర ముగ్ధుల‌య్యారు. వాటిని ఆస‌క్తిగా తిల‌కించిన అన్నా కొణిదెల క‌ళాకారుల‌కు రుసుము ఇచ్చి వాటిని కొనుగోలు చేశారు. ఎగ్జిబిష‌న్‌ను ఆస‌క్తిగా క‌లియ‌దిరిగి మ‌రీ చూశారు. ఈ సంద‌ర్భంగా కళాకారుల‌తో ప‌వ‌న్ దంప‌తులు ముచ్చ‌టించారు. వారి కుటుంబాలు, ఆదాయం, ప్ర‌భుత్వ ప్రోత్సాహ‌కం.. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ఇలా.. అన్ని విష‌యాలు తెలుసుకున్నారు. 

This post was last modified on August 15, 2026 8:16 pm

Share

Recent Posts

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

52 minutes ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

1 hour ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

3 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

4 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

5 hours ago