Political News

రాహుల్ రాముడైతే… జగ్గారెడ్డి హనుమంతుడు

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి వ్యవహార శైలి గురించి తెలిసిందే. తన పార్టీ అయిన, ప్రత్యర్థి పార్టీ అయినా…కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం ఆయన నైజం. తనను ఓడించిన ప్రజలపై అలగడం కూడా జగ్గారెడ్డికే చెల్లింది. రాహుల్ గాంధీ తన కోసం సంగారెడ్డి వచ్చి ప్రచారం చేసినా తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కోసం రాహుల్ గాంధీ సంగారెడ్డిలో ప్రచారం చేసిన తనను ప్రజలు ఓడించారని, ఇక జీవితంలో ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనని గతంలో తేల్చి చెప్పారు.

ఈ క్రమంలోనే తాజాగా ఆ కామెంట్లపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 1000 కోట్లిచ్చినా జగ్గారెడ్డి వంటి నాయకుడు దొరకరని, అటువంటి వ్యక్తిని ఓడించడం సంగారెడ్డి ప్రజల దురదృష్టమని జగ్గారెడ్డిని రేవంత్ ఆకాశానికెత్తేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాముడైతే, జగ్గారెడ్డి హనుమంతుడని పొగడ్తలతో ముంచెత్తారు.

తనను ఓడించినప్పటికీ కుటుంబాన్ని వదిలేసి మరీ జగ్గారెడ్డి ప్రజల మధ్యే తిరుగుతున్నారని కితాబిచ్చారు. ఒక వేళ కాంగ్రెస్ నాయకులకు మార్కులు వేస్తే తనకన్నా జగ్గారెడ్డికే మంచి మార్కులు వస్తాయని ప్రశంసించారు. అయితే, సంగారెడ్డిలో ఏం జరుగుతోందో తనకు తెలియదని, కానీ, జగ్గారెడ్డి మాత్రం ప్రజా జీవితంలో ఉండాలని రేవంత్ అన్నారు.

కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా వేదికపై జగ్గారెడ్డి, ఆయన సతీమణి పక్కన నిలబడి రేవంత్ రెడ్డి ఈ కామెంట్లు చేశారు. అయితే, జగ్గారెడ్డి ప్రజా జీవితంలో ఉండాలి అన్న రేవంత్ కోరిక మేరకు జగ్గారెడ్డి తన మంగమ్మ శపథాన్ని పక్కనబెట్టి రాబోయే ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. లేదంటే, కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుడిగా పేరున్న జగ్గారెడ్డిని కాంగ్రెస్ హై కమాండ్ ఏదైనా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయిస్తే అందుకు జగ్గారెడ్డి ఒప్పుకుంటారా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

This post was last modified on August 15, 2026 7:52 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

2 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

4 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

4 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

7 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

7 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

9 hours ago