Movie News

ట్రైల‌ర్ దెబ్బ అర్థ‌మైందా నానీ?

ఏ కొత్త సినిమా వ‌చ్చినా.. రిలీజ్ ముంగిట థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డం మామూలే. దాన్ని బ‌ట్టే తాము ఎలాంటి సినిమా చూడ‌బోతున్నామో ప్రేక్ష‌కులు ఒక అంచ‌నాకు వ‌స్తారు. క‌థ గురించి, పాత్ర‌ల గురించి.. సినిమాలో హైలైట్ల గురించి ఒక ఐడియా ఇచ్చేది ట్రైల‌రే. అది కేవ‌లం ఆన‌వాయితీ కాదు, అవ‌స‌రం కూడా. ఈ ట్రైల‌ర్ సంప్ర‌దాయం మొద‌ల‌య్యాక చాలా కొన్ని సినిమాలు మాత్రమే ఆ తంతు లేకుండా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి.

రెండు నెల‌ల ముందు నేచుర‌ల్ స్టార్ నాని మూవీ ది ప్యార‌డైజ్ విష‌యంలోనూ ఆ సాహ‌స‌మే చేసింది టీం. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా సినిమా పూర్తి కాక‌పోవ‌డం, ట్రైల‌ర్ మీద కొన్ని రోజుల స‌మ‌యాన్ని వెచ్చించే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో టీం ఈ విష‌యంలో వెనుకంజ వేసింది. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌ట్లేదంటూ నాని అండ్ టీం మీడియాకు, అభిమానుల‌కు స‌ర్దిచెప్పింది.

కానీ ది ప్యార‌డైజ్‌కు ట్రైల‌ర్ వ‌ద‌ల‌క‌పోవ‌డం మైన‌స్సే అయింది. సినిమా మీద స‌రైన ఐడియా లేకుండా థియేట‌ర్ల‌కు వెళ్లిన ప్రేక్ష‌కులు తెర మీద కంటెంట్ చూసి షాక‌య్యారు. ఫ‌లితంగా పెయిడ్ ప్రిమియ‌ర్స్ నుంచే బాగా నెగెటివ్ టాక్ వ‌చ్చిందీ సినిమాకు. మొత్తానికి ట్రైల‌ర్ లాంచ్ చేయ‌క‌పోవ‌డం త‌ప్ప‌ని రిలీజ్ త‌ర్వాత నాని అండ్ కోకు బాగానే అర్థ‌మైన‌ట్లుంది. ఈ విష‌యాన్ని నాని తాజాగా బ‌హిరంగంగా ఒప్పేసుకున్నాడు కూడా.

నాని ప్రొడ‌క్ష‌న్లో తెర‌కెక్కిన అలియాస్ రుక్మిణీ డిసెంబ‌రు 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ట్రైల‌ర్ గురించి వెల్ల‌డిస్తూ ఒక ఫ‌న్నీ వీడియో రిలీజ్ చేసింది టీం. ఇందులో ఈ మూవీకి ట్రైల‌ర్ వ‌ద్ద‌నుకుంటున్న‌ట్లు ద‌ర్శ‌కుడు ముర‌ళీకాంత్ నానితో అంటే.. అది క‌రెక్ట్ కాద‌ని, అనుభ‌వంతో చెబుతున్నాన‌ని నాని కామెంట్ చేశాడు.

మ‌రి టీజ‌ర్ లేకుండా నేరుగా ట్రైల‌ర్ వ‌దులుదామా అంటే మాత్రం అందుకు ఓకే అన్నాడు నేచుర‌ల్ స్టార్. ఈ నెల 26న ట్రైల‌ర్ లాంచ్ చేయ‌బోతున్న‌ట్లు వీళ్లిద్ద‌రూ క‌లిసి అనౌన్స్ చేశారు. నాని కామెంట్‌ను బ‌ట్టి చూస్తే ట్రైల‌ర్ లేకుండా ది ప్యార‌డైజ్ సినిమాను రిలీజ్ చేయ‌డం పెద్ద త‌ప్పే అని అత‌డికి బాగానే అర్థ‌మైన‌ట్లుంది.

This post was last modified on November 23, 2026 8:58 pm

Share

Recent Posts

జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ వెనుక అసలేం జరిగింది?

ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావం చూపుతున్న సంస్థల్లో ఎన్విడియా ఒకటి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం విస్తరిస్తున్న కొద్దీ…

16 minutes ago

గ్రామీణ ఎన్నిక‌లు ఏక‌ప‌క్షం

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు ముహూర్తం సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. ఈ నెలలోనే రెండు ద‌ఫాలుగా వ‌చ్చే నెల 2న మూడో…

31 minutes ago

అమెరికాలో ఆయన అరెస్ట్.. ఇక్కడ రంగంలోకి చిన్మయి

కర్నాటక సంగీతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన వయొలెన్ విధ్వాంసుడు హెచ్.ఎన్.భాస్కర్ అమెరికాలో అరెస్ట్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన అరెస్ట్ అయింది…

3 hours ago

సుకుమార్ కొత్త శిష్యుడి మీదే అందరి కళ్ళు

ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ ‘ఆర్జీవీ ఫిలిం ఫ్యాక్టరీ’ అని నిర్మాణ సంస్థ పెట్టి అనేకమంది శిష్యులను దర్శకులుగా పరిచయం…

3 hours ago

‘ట్రబుల్’ గాయాలు మానుతాయా?

తెలుగులో నేరుగా సినిమా చేయడానికి ముందే మన దగ్గర మంచి ఫాలోయింగ్ సంపాదించిన మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్. అతను…

4 hours ago

ఏఐ ముందుకు వెళ్తే… మనం వెనక్కి వెళ్లాల్సిందే..

సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న మార్పులు రోజురోజుకూ వేగం పుంజుకుంటున్నాయి. ఇప్పటివరకు మనుషుల మేధస్సు, అనుభవం అవసరమైన అనేక…

6 hours ago