శ్రీవిష్ణు ఈసారి సంక్రాంతికి సందడి చేయబోతున్నాడు. ఈ ఏడాది నారి నారి నడుమ మురారిలో చిన్న క్యామియో చేసి ఆ హిట్టులోనూ భాగం పంచుకోవడం చూశాం. అయితే విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ రూపంలో ఆశించిన ఫలితాలు దక్కలేదు కానీ కామ్రేడ్ కళ్యాణ్ రూపంలో మంచి రిలీఫ్ దక్కింది. సంవత్సరానికి మూడు సినిమాలు ఇవ్వడం చాలా కష్టమైన ట్రెండ్ లో శ్రీవిష్ణు దాన్ని అవలీలగా సాధించాడు. ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ తో మరోసారి ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. తాజాగా టీజర్ లాంచ్ చేశారు.
కథేంటో లైట్ గా రివీల్ చేశారు. పోలీస్ ఇన్స్ పెక్టర్ అర్జున్ (శ్రీవిష్ణు) చాలా జోవియల్ టైపు. కుటుంబం మిడిల్ క్లాస్ అయినా తన రూమ్ మాత్రం హై క్లాస్ రేంజులో మెయింటైన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తన పై అధికారి (మురళి శర్మ) కూతురు (సాక్షి మధోల్కర్) ని ప్రేమించి పెళ్లి దాకా తీసుకొస్తాడు. అయితే జీవితాన్ని జాలీగా గడిపే ఈ ఫ్యామిలీకి ధనవంతుల సంబంధం కుదిరాక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయి. అసలింతకీ ఫ్యామిలీ ఎజెండా ఏంటనేది తెరమీద చూడాలి.
దర్శకులు భాను భోగవరపు, నందు సవరిగాన జంట దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. సోషల్ మీడియా ట్రెండ్స్ ని బాగా ఒంటబట్టించుకున్న వైనం డైలాగుల్లో వినిపించింది. గుర్తింపు కథలు వద్దు బయట చెక్కేస్తున్నారు అంటూ శ్రీవిష్ణుతో చెప్పించడం ప్యాన్ ఇండియా పిచ్చి మీద సెటైర్ వేసినట్టే అనిపించింది. శ్రీవిష్ణు రెగ్యులర్ ఎనర్జీతో సామాజవరగమన మార్కు వినోదాన్ని దట్టించిన వైనం సన్నివేశాల్లో బాగా కనిపించింది.
ప్రస్తుతం అండర్ డాగ్ లాగా కనిపించినా ఫ్యామిలీ ప్యాక్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. సంక్రాంతికి కాకా, జనవరి 12 విడుదల, జార్జ్ క్రిష్, మహాకాళి లాంటి క్రేజీ సినిమాలు పొంచి ఉన్నాయి. పండగ చివర్లో వస్తున్న శ్రీవిష్ణు ఇంత కాంపిటీషన్ ని తట్టుకోవాలంటే ఆషామాషీగా ఉంటే సరిపోదు. నరేష్ మరోసారి చెలరేగిపోయే క్యారెక్టర్ డిజైన్ చేశారు. మురళీశర్మ, సుదర్శన్ తదితరులతో పెద్ద గ్యాంగ్ సెట్ చేశారు. అంచనాలు ఏర్పడేందుకు సరిపడా స్టఫ్ అయితే టీజర్ లో ఇచ్చారు.
This post was last modified on November 23, 2026 11:22 pm
ఈసారి బాక్సాఫీస్ పోటీ చాలా విచిత్రంగా జరుగుతోంది. శుక్రవారం విడుదలైన వాటిలో ఈ నగరానికి ఏమైంది రిపీట్ కు యూత్…
పట్టువదలని విక్రమార్కుడి బిరుదు ఎవరికైనా ఇవ్వాలంటే ముందు వరసలో ఉండే వాళ్లలో విజయ్ ఆంటోనీ పేరు ఉంటుంది. ఎందుకంటే బిచ్చగాడు…
ఏ కొత్త సినిమా వచ్చినా.. రిలీజ్ ముంగిట థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడం మామూలే. దాన్ని బట్టే తాము ఎలాంటి…
ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావం చూపుతున్న సంస్థల్లో ఎన్విడియా ఒకటి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం విస్తరిస్తున్న కొద్దీ…
గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నెలలోనే రెండు దఫాలుగా వచ్చే నెల 2న మూడో…
కర్నాటక సంగీతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన వయొలెన్ విధ్వాంసుడు హెచ్.ఎన్.భాస్కర్ అమెరికాలో అరెస్ట్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన అరెస్ట్ అయింది…