Movie News

డిసి నుంచి నేర్చుకోవాల్సింది ఇదే

పెద్దగా ప్రమోషన్లు చేయకుండా, జనాల్లో అంతగా ఆసక్తి కలిగించకుండా, ప్రమోషన్లకు దూరంగా ఉంటూ ఒక సినిమాకు ఓపెనింగ్స్ రావడం లేదా వీకెండ్ లో అనూహ్యమైన పికప్ చూపించడం చాలా అరుదు. రిలీజైన రోజే బాణాలు కాల్చి సక్సెస్ మీట్లు పెట్టేసి, మూడు రోజుల పాటు వరసగా మీడియా సమావేశాలు నిర్వహించి మాది హిట్టు హిట్టు అని చెప్పుకుంటున్న ట్రెండ్ లో డిసి ఇవేవి చేయకుండానే ఆడియన్స్ ని థియేటర్ల వైపు లాగడం ట్రేడ్ వర్గాలను, విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.

డిసి తీసింది సన్ పిక్చర్స్ అయినప్పటికీ దీనికి వందల కోట్లు ఖర్చు పెట్టలేదు. నాలుగైదు అవుట్ డోర్ లొకేషన్లు, ఓ మూడు ఇంటీరియర్లతో మోత్తం కానిచ్చేశారు. దేనికైనా ఎక్కువ వ్యయం అయ్యిందంటే అది ఒక్క అనిరుధ్ రవిచందర్ కు ఇచ్చిన రెమ్యునరేషన్ మాత్రమే. హీరో లోకేష్ కనగరాజ్ పారితోషికంతో సహా అన్ని రీజనబుల్ బడ్జెట్ తో అయిపోయినవే. విఎఫెక్స్ కూడా పెద్దగా వాడలేదు. మొత్తం రా అండ్ రస్టిక్ టేకింగ్ తో దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ డిసిని షూట్ చేశారు.

ఒకపక్క కొరియన్ కనకరాజు ఊపులోనూ డిసి లాంటి డబ్బింగ్ మూవీ తన ఉనికిని చాటుకోవడం చిన్న విషయం కాదు. కారణం కథలో ఉన్న ఇంటెన్సిటీ. వయొలెన్స్ ఎంత ఉన్నప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేసే కొన్ని ఎపిసోడ్లు చేసిన స్క్రీన్ ప్లే మేజిక్ ఇది. ముఖ్యంగా చాలా అరుదుగా కలిగే అనుభూతిని బ్యాకేక్ గ్రౌండ్ స్కోర్ ద్వారా ఇచ్చిన అనిరుద్ ఈ మూవీకి ప్రాణంగా నిలిచాడు. ఒకవేళ తను కాకుండా వేరొకరు కంపోజ్ చేసి ఉంటే ఇంత ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండేది కాదు.

సో ఆడియన్స్ కేవలం వరల్డ్ బిల్డింగ్, గ్రాఫిక్స్, ఎలివేషన్స్ మాత్రమే కోరుకోవడం లేదు. ఘాడత ఉన్న కథలు రాసుకుని దానికి మాస్ ట్రీట్ మెంట్ ఇస్తే చాలు క్లాసు మాస్ అందరూ చూస్తారని డిసితో అర్థమైపోయింది. ఇది వంద కోట్లు దాటుతుండగా లేదానేది ఇక్కడ ప్రశ్న కాదు. పబ్లిక్ అటెన్షన్ ని ఎలా రాబట్టుకుందనే దాని మీద అనాలిసిస్ చేసుకుంటే రాబోయే దర్శకులకు కొత్త దారులు దొరుకుతాయి. ఏళ్లకేళ్లు వృథా చేయాల్సిన అవసరం లేకుండా తక్కువ టైంలో సినిమాలు తీసే ధైర్యం ఇస్తాయి. 

This post was last modified on August 11, 2026 4:47 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

2 hours ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

3 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

4 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

5 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

5 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

5 hours ago