Movie News

కొడుకు కోసం బండ్ల గ‌ణేష్‌ పెద్ద ప్లానింగే

ఇండియాలో ప్ర‌తి ఫిలిం ఇండ‌స్ట్రీలోనూ వార‌సత్వ హీరోల ఆధిప‌త్య‌మే క‌నిపిస్తుంది. తెలుగులో అది మ‌రీ ఎక్కువ‌. ఇక్క‌డ ఇప్ప‌టికే బోలెడంత మంది వార‌సులున్నారు. పేరున్న కుటుంబాల నుంచి ఇంకా ఇంకా కొత్త హీరోలు వ‌స్తూనే ఉన్నారు. ఇటీవ‌లే సూప‌ర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి జైకృష్ణ ఘ‌ట్ట‌మ‌నేని శ్రీనివాస మంగాపురం ద్వారా హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా త‌న ఇద్ద‌రు కొడుకుల‌ను హీరోల‌ను చేయాల‌నుకుంటున్నాడు. 

ముందుగా పెద్ద కొడుకు హితేష్ అరంగేట్రం కోసం కొంత కాలంగా బండ్ల క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. తాజాగా త‌న డెబ్యూ మూవీ కోసం బండ్ల రంగం సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. ఇందుకోసం ఒక పెద్ద ద‌ర్శ‌కుడినే బండ్ల ఖాయం చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ ద‌ర్శ‌కుడికి అడ్వాన్స్ కూడా ఇచ్చిన బండ్ల క‌థ రెడీ చేయించే ప‌నిలో ప‌డ్డాడ‌ట‌.

హితేష్‌ను ఇటీవ‌లే త‌న కూతురి పెళ్లి వేడుక‌లో అంద‌రికీ ప‌రిచ‌యం చేశాడు బండ్ల‌. సంగీత్ ఈవెంట్లో టెంప‌ర్, చిరుత సినిమాల్లో పాట‌ల‌కు అదిరిపోయే స్టెప్పులేసి ఆక‌ట్టుకున్నాడు హితేష్‌. ఒడ్డూ పొడ‌వూ కూడా బాగుండ‌డంతో అత‌ను హీరోగా రాణించ‌గ‌ల‌డ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. 

ఈ ఉత్సాహంలోనే బండ్ల త‌న కొడుకు అరంగేట్ర చిత్రానికి స‌న్నాహాలు వేగ‌వంతం చేశాడు. గ‌తంలో బెల్లంకొండ సురేష్ త‌న కొడుకు శ్రీనివాస్‌ను హీరోగా ప‌రిచ‌యం చేసేట‌పుడు ఎలాంటి గ్రౌండ్ ప్రిపేర్ చేశాడో తెలిసిందే. వి.వి.వినాయ‌క్ లాంటి పెద్ద ద‌ర్శ‌కుడితో పెద్ద బ‌డ్జెట్లో సినిమా తీశాడు. బండ్ల కూడా అదే బాట‌లో సాగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

This post was last modified on August 12, 2026 5:16 pm

Share

Recent Posts

ఓటేయకుండా బెంగళూరు వెళ్ళిపోయిన జగన్

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిన అవసరం వుంది. అయితే బాధ్యాయుతమైన ఒక ప్రతిపక్ష నాయకుడు ఓటు…

1 hour ago

ఇప్పటివరకు చూడని సూర్యావతారం

ఎన్నో ఏళ్ల పాటు సరైన విజయం లేక ఇబ్బంది పడ్డ తమిళ సూపర్ స్టార్ సూర్య.. ఈ ఏడాది రెండు…

1 hour ago

‘రాప్తాడు’ బాలికకు రాబోయే 48 గంటలు కీలకం

అనంతపురం జిల్లాలోని రాప్తాడులో పదో తరగతి బాలికపై తరగతి గదిలోనే అత్యంత పాశవికంగా ఒక ఉన్మాది ఎలక్ట్రికల్ రంపం(చైన్ సా)తో…

2 hours ago

RC17… అసలు విషయం చెప్పలేేదే

‘రంగస్థలం’ లాంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ అందించిన రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో కొత్త సినిమా కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు…

2 hours ago

రోడ్డుపై కూర్చొని జగన్ నిరసన

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని బ‌కారాపురంలో హ‌ల్చ‌ల్ చేశారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లను…

3 hours ago

జ‌గ‌న్‌కు.. మా జీవితాలు నాశనం చేశావ్!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చేదు అనుభవం ఎదురైంది. పులివెందుల‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చిన జ‌గ‌న్‌కు అనూ హ్యంగా వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో…

4 hours ago