Political News

తెలంగాణాకు మరో డిప్యూటీ సీఎం వస్తారా..?

త్వరలోనే తెలంగాణాకు మరో డిప్యూటీ సీఎం వస్తారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తొలిగించినప్పటి నుంచి త్వరలో తెలంగాణాలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం కొనసాగుతోంది. ఎప్పుడు జరుగుతుందో చెప్పమని అడిగితే మాత్రం రేపో మాపో తప్పకుండా జరుగుతుందని జోస్యం చెప్పేవారి సంఖ్య ఎక్కువై పోయింది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ సంగతేమో కానీ త్వరలో రాష్ట్రానికి డిప్యూటీ సీఎం వస్తారన్న ప్రచారం జోరందుకుంది.

తెలంగాణాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లయ్యింది. రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినప్పుడే డిప్యూటీ ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కను నియమించింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్రభుత్వం సజావుగా కొనసాగుతుంది. కాంగ్రెస్ మార్క్ అసంతృప్తి వున్నప్పటికి అది సహజమేనని ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడం మానేశారు. అయితే సోషల్ ఇంజనీరింగ్ నేపథ్యంలో ఒక బీసీ నాయకుడికి డిప్యూటీ సీఎం పగ్గాలు అందిస్తే బాగుంటుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రాష్ట్రంలో బీసీ జనాభా 56 శాతానికి పైగానే వున్నారు. వారికి అధికారంలో భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం వుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. భాగస్వామ్యం కాదు అసలు అధికారమే అప్పగించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ సమయం వచ్చినప్పుడు దేన్ని ఆపలేరు కానీ ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం పదవి మాత్రం నోటి కాడికి వచ్చిందనే చెప్పొచ్చు. డిసెంబర్ 7 తర్వాత ఈ విషయం మీద ఒక క్లారిటీ వచ్చేస్తుందని మీడియా అంచనా వేస్తుంది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పగ్గాలు బీసీ చేతిలోనే వున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహారిస్తున్నారు. ఆయన ఇటు అధినేత రాహుల్ గాంధీని, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేనేజ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పార్టీలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. అధినేత రాహుల్ నమ్మకం కూడా సంపాదించారు. కనుక డిప్యూటీ సీఎం పదవి మహేష్ కుమార్ గౌడ్ కు ఇచ్చే అవకాశం వుందని ఢిల్లీ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. పొన్నం ప్రభాకర్ కూడా తనదారిన తాను ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కానున్న ఒక బీసీ మహిళకు కేబినెట్ లో చోటు కల్పిస్తారని తెలుస్తోంది.

This post was last modified on November 23, 2026 10:20 pm

Share

Recent Posts

జాన్వి ర‌చ్చ‌.. శ్రుతి హాస‌న్ రియాక్ష‌నేంటి

పెద్ది సినిమాలో త‌న పాత్ర‌ను ప్రెజెంట్ చేసిన తీరు గురించి బాలీవుడ్ భామ జాన్వి క‌పూర్ ఈ మ‌ధ్య కాఫీ…

7 hours ago

ఫ్యామిలీ జోకులతో ప్యాక్ నిండిపోయింది

శ్రీవిష్ణు ఈసారి సంక్రాంతికి సందడి చేయబోతున్నాడు. ఈ ఏడాది నారి నారి నడుమ మురారిలో చిన్న క్యామియో చేసి ఆ…

7 hours ago

సోమవారం పరీక్షలో నిలబడిన తార

ఈసారి బాక్సాఫీస్ పోటీ చాలా విచిత్రంగా జరుగుతోంది. శుక్రవారం విడుదలైన వాటిలో ఈ నగరానికి ఏమైంది రిపీట్ కు యూత్…

8 hours ago

బిచ్చగాడు హీరోకి నాన్న హిట్టిస్తాడా

పట్టువదలని విక్రమార్కుడి బిరుదు ఎవరికైనా ఇవ్వాలంటే ముందు వరసలో ఉండే వాళ్లలో విజయ్ ఆంటోనీ పేరు ఉంటుంది. ఎందుకంటే బిచ్చగాడు…

8 hours ago

ట్రైల‌ర్ దెబ్బ అర్థ‌మైందా నానీ?

ఏ కొత్త సినిమా వ‌చ్చినా.. రిలీజ్ ముంగిట థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డం మామూలే. దాన్ని బ‌ట్టే తాము ఎలాంటి…

10 hours ago

జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ వెనుక అసలేం జరిగింది?

ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావం చూపుతున్న సంస్థల్లో ఎన్విడియా ఒకటి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం విస్తరిస్తున్న కొద్దీ…

10 hours ago