డిఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షల వివాదం విజయవాడ రాజకీయాల్లో అగ్గి రాజేశాయి. గురువారం జరిగిన గందరగోళం మీద ఇరు పక్షాలు ఒకరిమీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు పొందెందుకే ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు ప్రశాంతంగా జరుగుతున్న దీక్షలను భగ్నం చేసేందుకు ప్రయత్నించారని వైసీపీ ఆరోపణలు చేయగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, నోరు పారేసుకుంటే ఎక్కడికైనా వస్తాం, సంగతి తెలుస్తామంటూ ఉమా ఘాటుగా సమాధానం ఇచ్చారు.
ఎమ్మెల్యే ఉమా ఇంకా ఏమన్నారంటే….
విజయవాడలో ముగ్గురు పనికిమాలిన వాళ్ళున్నారని.. మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ లను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఒకడు పకోడీగాడు, మరొకడు నత్తి పకోడీగాడు అంటే విరుచుకొని పడ్డారు. ఈ ముగ్గురిని పక్కన పెడితేనే వైసీపీకి మనుగడ సాధ్యం అవుతుందని లేకపోతే లేదన్నారు. మల్లాది విష్ణు బ్రాహ్మణుడై ఉండి కూడా మద్యం దుకాణం నిర్వహిస్తున్నాడని, వైసీపీ నాయకులు ఇప్పుడు అతడి కులాన్ని బయటకు తీసుకొచ్చి ఆ కులం పరువు తీస్తున్నారని విమర్శించాడు.
ఉమా విమర్శలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తన సహనాన్ని పరీక్షించ వద్దని, ఎక్కడికైనా వచ్చి బుద్ది చెబుతానన్న హెచ్చరించడం వైరల్ అవుతుంది. ఉమా గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో వైసీపీ నాయకుల నుంచి స్పందన లేదు. అనవసరంగా తొందరపడ్డామేమో అని వైసీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ముగ్గురు అగ్ర నాయకుల మధ్య సమన్వయం లేకుండా పోవడం వల్లే దీక్షలు రసాభసాగా మారాయన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates