నీట్ పేపర్ లీకేజి వ్యవహారం కేంద్రంలోని బీజేపీని నీడలా వెంటాడుతూనే వుంది. 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నాక కూడా ప్రభుత్వం స్పందించక పోవడంతో విద్యార్థుల్లో ఆగ్రహం తెప్పించింది. చివరికది జంతర్ మంతర్ ఆందోళనకు దారి తీసింది. అప్పటికైనా కళ్ళు తెరిచిందా అంటే లేదు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించింది. ఈ విషయం పై తాజాగా సీ ఓటర్ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కేంద్ర ప్రభుత్వం తీరుపై ప్రజలు అసంతృప్తి వెళ్ళగక్కినట్లు రిపోర్టు వచ్చింది. ఎన్డీఏ ఓటర్లలో ఈ అసంతృప్తి ఎక్కువగా ఉన్నట్లు తేలడం చర్చకు దారితీసింది.
నీట్ పేపర్ లీకేజి, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో జులై 29,30 తేదీల్లో సీ ఓటర్ ఒక సర్వే నిర్వహించింది. ఆన్ లైన్ సిస్టంలో ఫోన్ ద్వారా 1349 మంది నుంచి అభిప్రాయాలను సేకరించి రిపోర్ట్ రూపొందించింది. నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం, అమానుష ప్రవర్తన పై సమగ్ర విచారణ జరపాలని 62.7 శాతం మంది కోరారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ 62.7 శాతం మందిలో 58 శాతం మంది ఎన్డీఏ మద్దతుదారులున్నారు. సోషల్ మీడియాలో అనుచితంగా ప్రవర్తించడం ద్వారా హింసను ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని 54.2 శాతం మంది కోరారు. పేపర్ లీకేజిని అరికట్టెందుకు కఠిన చట్టాలు చేయాలని 31.7 శాతం కోరారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక ఇంత పెద్ద సంఖ్యలో వ్యతిరేకత రావడం ఇదే మొదటిసారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకరకంగా ఇది మోదీ ప్రభుత్వానికి ప్రమాద హెచ్చరికలాంటిదని విశ్లేషిస్తున్నారు. విద్యార్థులు ఆందోళన విరమించుకున్న తర్వాత విద్యార్థులపై కేసులు పెట్టడంపై కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇదేమి పట్టించుకునేలా లేదు. మళ్ళీ మరోసారి ఇలాంటి ఉద్యమం తలెత్తకుండా కఠినంగా వ్యవహారించాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates