కేవలం తొమ్మిది రోజుల్లో ది ప్యారడైజ్ థియేటర్లలో అడుగు పెట్టనుంది. విపరీతమైన అంచనాలతో పాటు ఒత్తిడి కూడా అదే స్థాయిలో చూస్తున్న నాని బృందం ప్రస్తుతం చివరి దశ పనులను ముళ్ళమీద కాళ్ళు పెట్టి పరుగులు పెట్టిస్తోంది. ట్రైలర్ కట్ చేయడానికి కూడా టైం లేనంత బిజీగా ఉన్నామని నాని ఇటీవలే ప్రెస్ మీట్ లో చెప్పిన సంగతి తెలిసిందే. అన్ని ఏరియాలకు బిజినెస్ వ్యవహారాలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది ప్రీమియర్లు, మొదటి పది రోజులకు టికెట్ రేట్లు నిర్ణయించడం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ముందు రోజు రాత్రి వేసే ప్రీమియర్లకు సింగల్ స్క్రీన్ 300, మల్టీప్లెక్స్ 400 రూపాయలు పెట్టాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందట. తర్వాత పది రోజుల పాటు తెలంగాణలో ఆల్రెడీ ఉన్న గరిష్ట ధర మీద సింగల్ స్క్రీన్ 50 రూపాయలు, మల్టీప్లెక్స్ 75 రూపాయలు ఒక టికెట్ మీద హైక్ అడిగే ప్లాన్ ఆల్మోస్ట్ ఓకే అవ్వొచ్చని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే మోడల్ ఫాలో కావొచ్చు. అదే జరిగితే నైజామ్ కంటే ఏపీ ధరలు కొంచెం తక్కువగా ఉంటాయి.
మరీ అత్యాశకు వెళ్లకుండా రీజనబుల్ గా ఉండే సాధ్యాసాధ్యాలను నిర్మాత సుధాకర్ చెరుకూరి, పంపిణీదారులు కలిసి చర్చిస్తున్నారని తెలిసింది. పెట్టుబడులు భారీగా ఉన్న నేపథ్యంలో పైన చెప్పిన పెంపులు సబబుగా ఉంటాయని, పాజిటివ్ టాక్ వస్తే చాలు రేట్ల గురించి పట్టించుకోకుండా ఆదరించడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని డిస్ట్రిబ్యూటర్ వర్గాలు అంటున్నాయట. ప్యారడైజ్ స్కేల్ మీద అందరికీ అవగాహన ఉంది కాబట్టి దీన్ని నెగటివ్ గా చూడరని వాళ్ళ అభిప్రాయం.
ఒకరకంగా చెప్పాలంటే పైన చెప్పిన రూటులో వెళ్లడం మంచిదే. లేదూ ఇరుముడి లాగా ఎలాంటి పెంపులు లేకుండా వెళ్తే మరీ మంచిది. థియేటర్ పరంగా లాంగ్ రన్ వస్తుంది. అయితే బిజినెస్ నెంబర్ల దృష్ట్యా అదంత ఈజీ కాదు. మొదటి షో పడే దాకా ఇలాంటి డిస్కషన్లు, ఆందోళనలు ప్యారడైజ్ కోసం వెయిట్ చేస్తున్న అందరికీ తప్పేలా లేవు.
Gulte Telugu Telugu Political and Movie News Updates