జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ విడుదల చేసిన వీడియోతో తిరిగి రాజుకున్నట్లయింది. ఆందోళన సందర్బంగా విద్యార్థులు తనను, స్వర్గస్తురాలైన తన తల్లిని దుషించారని, అయినా వారిని క్షమిస్తున్నానంటూ ప్రధాని చెప్పడంపై కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు.
విద్యార్థులను క్షమించినట్లు చెబుతున్న ప్రధాని విద్యార్థులపై జులై 20 వ తేదీన పోలీసులు చేసిన లాఠిచార్జీని కూడా క్షమించేశారా అని విద్యార్థి నాయకుడు అభిజిత్ దీప్కే ప్రశ్నించారు. శుక్రవారం రాత్రి విడుదల చేసినట్లే శనివారం కూడా ప్రధాని వీడియో విడుదల చేస్తారని భావిస్తున్నట్లు వ్యంగాస్త్రాలు సంధించారు.
ఈసారి వీడియోలో పోలీసులు చేసిన లాఠిఛార్జి పై క్షమాపణలు కోరాలన్నారు. పోలీసులు 12 ఏళ్ళ బాలికల తలలు పగొట్టారని, అమ్మాయిల ప్రైవేటు పార్ట్స్ మీద కూడా దాడులు చేశారని చెప్పాడు. పురుష పోలీసులు అమ్మాయిల దుస్తులు చింపివేశారని, చితకబాదారని చెప్పాడు. ప్రధాని కొత్తగా విడుదల చేసే వీడియోలో దీనికి క్షమాపణలు కోరాలని డిమాండ్ చేసాడు.
మోదీ క్షమాపణలు విద్యార్థులకు అవసరం లేదని, ఆయనే విద్యార్థులకు క్షమాపణలు కోరాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ విరుచుకొని పడ్డారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు పెట్టిన రాహుల్ నీట్ పేపర్ లీకేజితో భయాందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను మోదీ ఇప్పటి వరకు పలకరించని మోదీకీ విద్యార్థులు క్షమిస్తున్నట్లు చెప్పే ధైర్యం ఎక్కడిదని ప్రశ్నించారు. వామపక్ష పార్టీలు సైతం విమర్శలు గుప్పించాయి. ఇపుడు దేశంలోని రాజకీయ పార్టీలన్నీ జంతర్ మంతర్ కేంద్రంగా రెండుగా విడిపోయి పరస్పరం విమర్శలు చేసుకోవడం ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates

