నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన అర్థరాత్రి సెల్ఫీ వీడియో రాజకీయంగా, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. తనపై వచ్చిన విమర్శలను, వ్యతిరేకతను ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశంగా మలుచుకున్నారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి, వీడియో విడుదలైన కొద్ది గంటల్లోనే అది భారీ స్పందనను రాబట్టింది. తనపై విసిరిన రాళ్లను మెట్లుగా మార్చుకోవడం అంటే.ఇదేనేమో?
గురువారం అర్థరాత్రి విడుదలైన ఈ వీడియోకు 24 గంటల్లోనే 303 మిలియన్లకు పైగా వీక్షణలు నమోదైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ప్రధాని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఒక్క రోజులో సుమారు 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు చేరగా, మొత్తం ఫాలోవర్ల సంఖ్య 102 మిలియన్లకు చేరినట్లు పేర్కొంటున్నారు.
సాధారణంగా ప్రధానమంత్రి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సి వచ్చినప్పుడు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ముందుగానే సమాచారం విడుదల చేస్తుంది. అయితే ఈసారి ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే అర్థరాత్రి సెల్ఫీ వీడియోను విడుదల చేయడం విశేషంగా మారింది. మీడియాలో ప్రత్యక్షంగా మాట్లాడరనే విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ వీడియో విడుదల కావడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
మొదటి వీడియోకు లభించిన స్పందన నేపథ్యంలో మరో వీడియోను కూడా ప్రధాని మోదీ విడుదల చేశారు. వీడియోలకు విశేష ఆదరణ చూపిన విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుతూ, “మీ ప్రేమ ఇలాగే కొనసాగాలి… మన బంధం ఎప్పటికీ పటిష్టంగానే ఉంటుంది” అని పేర్కొన్నారు. సలహాలు, సూచనలు పంపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియోలకు కోటిన్నరకు పైగా లైక్‌లు, 10 లక్షలకు పైగా కామెంట్లు వచ్చినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates

